ఆ మాట ఎప్పటికీ మర్చిపోలేను.. చిరంజీవిపై నాని ఎమోషనల్

Chiranjeevi- Nani: నాని.. ఈ పేరు ఇప్పుడు టాలీవుడ్ లో ఒక బ్రాండ్‌గా మారిపోయింది. అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆయన, తన టాలెంట్ తో నేచురల్ స్టార్ స్థాయికి ఎదిగారు. ప్రతి పాత్ర కోసం పూర్తిస్థాయిలో సిద్ధమయ్యే నాని ఎంతో డెడికేషన్ గా నటిస్తున్నారు. అందుకే చిన్న హీరోగా కెరీర్ ప్రారంభించిన నాని ఇప్పుడు స్టార్ హీరోగా మారారు. ఇక త్వరలోనే అవైటెడ్ మూవీ ప్యారడైజ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ తరుణంలో నానికి సంబంధించిన ఓ ఇంటర్వ్యూ తెగ వైరలవుతోంది. అందులో ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవిపై నాని చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఇంతకీ ఏమన్నారంటే..?

నేచురల్ స్టార్ నాని యాంకర్ సుమకు ఓ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇటీవల సినీ పరిశ్రమలో ఒక టాక్ బలంగా వినిపిస్తోంది. "నాని సినిమా అంటే కనీసం మంచి సినిమా అన్న గ్యారెంటీ ఉంటుంది" అని అభిమానులతో పాటు సినీ వర్గాలు కూడా భావిస్తున్నాయి. వరుసగా విభిన్న కథలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న నాని.. తన సినిమాల ఎంపికలో చూపించే జాగ్రత్త వల్లే ఈ నమ్మకం ఏర్పడిందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. అయితే ఇదే విషయాన్ని సుమ నేరుగా నాని ముందు ప్రస్తావించింది. "నాని సినిమా అంటే గ్యారెంటీ అనే టాక్ ఇండస్ట్రీలో నడుస్తోంది. ఆ గ్యారెంటీ ఎలా వస్తుంది?" అని ప్రశ్నించగా.. నాని చాలా వినమ్రంగా స్పందించారు.

Nani Calls Chiranjeevi s Praise the Greatest Award of His Career and Life Journey

"గ్యారెంటీ అని ప్రత్యేకంగా చెప్పలేం. మనం చేసే పనిని ఎంత నిజాయితీగా, ఎంత కరెక్ట్‌గా తీసుకెళ్తామన్నదే ముఖ్యమైన విషయం. మన మీద మనకు నమ్మకం ఉండాలి. నేను చేసే ప్రతి సినిమాలో ప్రేక్షకులతో ఉన్న బంధాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేస్తాను. ప్రేక్షకులతో నాకు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఆ బంధం కోసమే నేను ఇష్టపడి పని చేస్తూ ఉంటాను. అయితే ఇదే ఎప్పటికీ కొనసాగుతుంది అని ఎవరూ చెప్పలేరు. ప్రతి సినిమా ఒక కొత్త పరీక్ష లాంటిదే" అని అన్నారు.

అంతేకాదు, విజయానికి కేవలం కష్టపడటం ఒక్కటే సరిపోదని కూడా నాని పేర్కొన్నారు. "మనం ఎంత కష్టపడినా పెద్దల ఆశీర్వాదాలు, ప్రేక్షకుల ప్రేమ, సమయం కలిసి రావాలి. కొన్ని విషయాలు మన చేతుల్లో ఉండవు. మన పని మనం నిజాయితీగా చేయడం మాత్రమే మన బాధ్యత" అని తెలిపారు. ఇక ఈ సంభాషణలో అత్యంత ఆసక్తికరమైన అంశం మెగాస్టార్ చిరంజీవి గురించి నాని చేసిన వ్యాఖ్యలే. ఇటీవల ఓ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ.. "నాని సినిమా చేస్తున్నాడంటే ప్రేక్షకులు ధైర్యంగా థియేటర్‌కి వెళ్లొచ్చు. అతను కథల ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉంటాడు" అంటూ ప్రశంసలు కురిపించారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఈ ఇంటర్వ్యూలో చిరంజీవి కామెంట్స్ పై నాని స్పందిస్తూ.. తన ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోయారు. "నిజంగా చెప్పాలంటే చిరంజీవి గారు చేసిన ఆ కామెంట్స్ నాకు చాలా ఉత్సాహాన్ని ఇచ్చాయి. ఆయన కేవలం ఒక స్టార్ హీరో మాత్రమే కాదు. తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో తరాలకు స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తి. ఆయన కెరీర్ ఎంతో గొప్పది. దాదాపు ఆయన కెరీర్‌లో 70 నుంచి 80 శాతం పూర్తయిన తర్వాత నేను ఇండస్ట్రీలోకి వచ్చాను. అలాంటి లెజెండ్‌కు నా పని మీద నమ్మకం ఉందంటే అంతకంటే పెద్ద ఆనందం ఏముంటుంది?" అని అన్నారు.

అంతేకాకుండా చిరంజీవి ప్రశంసలను తన జీవితంలోనే గొప్ప అవార్డుగా భావిస్తున్నట్లు నాని వెల్లడించారు. "ఎన్ని అవార్డులు వచ్చినా, ఎన్ని ప్రశంసలు అందుకున్నా.. చిరంజీవి గారి లాంటి వ్యక్తి నాపై నమ్మకం ఉందని చెప్పడం నాకు ఈ ప్రపంచంలోనే అత్యుత్తమ అవార్డు లాంటిది. ఆయన మాటలు నాకు మరింత బాధ్యతను పెంచాయి" అని నాని భావోద్వేగంగా చెప్పారు. ప్రస్తుతం నాని చేసిన ఈ వ్యాఖ్యలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా చిరంజీవి ప్రశంసలను అవార్డుతో పోల్చిన నాని మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read more about: anchor suma nani chiranjeevi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X