Shyam Singha Roy: పెరుగుతున్న డిమాండ్.. నాని కెరీర్ లోనే బిగెస్ట్ డీల్స్!

నేచురల్ స్టార్ నాని ఇటీవల కాలంలో చేసిన సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీ లో విడుదలైన విషయం తెలిసిందే. నాని బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకొని చాలా కాలం అవుతుంది. ఎంసీఏ సినిమా తర్వాత నాని మళ్ళీ ఎన్ని విభిన్నమైన సినిమాలు చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేదు. ఎలాంటి సినిమా చేసిన వరుసగా నిరాశపరుస్తున్నాయి. గతంలో మాదిరిగా నాని సినిమాలు డబుల్ ప్రాఫిట్స్ అంధించి చాలా కాలం అవుతోంది. నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమా చివరగా థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. ఆ సినిమా కూడా పెద్దగా లాభాలు తేలేకపోయింది. ఇక ఆ తర్వాత ఎలాగైనా V సినిమాతో మంచి విజయాన్ని అందుకోవాలని అనుకున్నాడు.

మోహన్ క్రిష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ క్రియేట్ అయ్యాయి. విడుదలకు ముందు మంచి హైప్ క్రియేట్ చేసింది కానీ కరోనా లాక్డౌన్ కారణంగా సినిమాను డైరెక్ట్ గా అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయాల్సి వచ్చింది. ఒక విధంగా సినిమాను ఓటీటీలో విడుదల చేయడమే మంచిదయినట్లు ఆ తర్వాత కామెంట్స్ అయితే బాగానే వచ్చాయి. ఇక ఈ సినిమా ఫ్లాప్ టాక్ రావడంతో టక్ జగదీశ్ సినిమాతో మంచి విజయాన్ని అందుకోవాలని నాని అనుకున్నాడు. నిన్నుకోరి దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన ఆ సినిమా ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వచ్చినప్పటికీ థియేటర్స్ లో విడుదల కాలేకపోయింది.

Nani career biggest deals for Shyam Singha Roy bussiness

నిర్మాతలు థియేటర్స్ లో విడుదల చేయలేక డైరెక్ట్ గా మళ్లీ అమెజాన్ ప్రైమ్ లోనే విడుదల చేయాల్సి వచ్చింది. ఆ సినిమా థియేటర్స్ లో విడుదల చేయాలనే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. ఇక ఇప్పుడు అందరి ఫోకస్ కూడా శ్యామ్ సింగరాయ్ సినిమా పైనే ఉంది. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ఇక నాని కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా పై అంచనాలు కూడా గట్టిగానే ఉన్నాయి. ఇక ఇప్పటికే నిర్మాతలకు అన్ని ఏరియాల నుంచి భారీగా ఆఫర్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నైజాంలో అయితే నాని గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒక బిగ్గెస్ట్ డీల్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

అలాగే సీడెడ్ లో కూడా ఈ సినిమాకు భారీగా ఆఫర్ దక్కినట్లు తెలుస్తోంది. సినిమా ఏ మాత్రం హిట్ అయినా కూడా నాని తన జీవితంలోనే అత్యధిక బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉందట. మరి సినిమా ఏ స్థాయిలో వసూళ్లను అందుకుంటుందో చూడాలి. ఇక నాని శ్యామ్ సింగరాయ్ సినిమా అనంతరం అంటే సుందరానికి అనే మరొక కామెడీ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఆ సినిమా తర్వాత దసరా అనే మరొక మాస్ యాక్షన్ సినిమాలో నాని నటించబోతున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X