Nani: నా ఆఫీస్ లో ఇలా కూడా చేస్తారా.. అడవిశేష్ పై నాని కామెంట్స్

నేచురల్ స్టార్ నాని గురించి తెలుగు ప్రేక్షకులు పరిచయం ఏమాత్రం అవసరం పేరు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చి తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ సంపాందిచుకున్న హీరో నాని. అసిస్టెంట్ డైరెక్టర్ గా సినీ కెరీర్ ను ప్రారంభించిన నాని ఇప్పుడు మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు సంపాదించుకున్నాడు. హిట్లు ప్లాప్ లతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు.

అలాగే హీరోగా డిఫరెంట్ కథలను ఎంచుకోవడమే కాకుండా నిర్మాతగా మారి న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తున్నాడు. వాల్ పోస్టర్ బ్యానరపై నాని నిర్మించిన చిత్రం హిట్. ప్రస్తుతం హిట్ 2 కూడా రాబోతుంది. అయితే తాజాగా అడవి శేష్ పై నాని ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

దర్శకుడిగా పరిచయం..

దర్శకుడిగా పరిచయం..

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మొదటిసారిగా పోలీస్ ఆఫీసర్ గా నటించి అదరగొట్టిన చిత్రం హిట్ (HIT: The First Case). నాచురల్ స్టార్ నాని నిర్మాతగ వ్యవహరించిన ఈ చిత్రంతో శైలేష్ కొలను దర్శకుడిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. నిర్మాతగా మారిన నాని న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. దీంతో శైలేష్ కొలను చేసింది మొదటి సినిమా అయినా సూపర్ హిట్ కొట్టారు.

2020లో వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ "హిట్: ది ఫస్ట్ కేస్" మంచి ప్రేక్షకాదరణ పొందింది. అంతేకాకుండా హిందీలో కూడా ఇదే పేరుతో విడుదలైంది. అక్కడ కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే తెలుగులో ఈ సినిమా వచ్చినప్పుడు దీనికి సీక్వెల్ ఉంటుందని హింట్ కూడా ఇచ్చారు. అందుకనుగుణంగానే ఇప్పుడు "హిట్: ది సెకండ్ కేస్" ను తీసుకువచ్చారు. ఈ సెకండ్ కేస్ లో హీరోగా అడవి శేష్ నటించాడు.

అడవి శేష్ నటన

అడవి శేష్ నటన

ఇటీవల విడుదల చేసిన ఈ సీక్వెల్ మూవీ టీజర్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. డిఫరెంట్ యాటిట్యూడ్ తో అడవి శేష్ నటన ఆకట్టుకుంది. సెటైరికల్ అండ్ ఇంటెన్షనల్ పోలీస్ ఆఫీసర్ గా దర్శనమిచ్చాడు అడవి శేష్. టీజర్ మొత్తం ఫన్నీగా సాగిన చివర్లో ఓ క్రైమ్ సీన్ తో సూపర్బ్ థ్రిల్లింగ్ ఇచ్చారు. టీజర్ చూస్తే ఫస్ట్ మూవీకి మించి క్రైమ్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో కనిపించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.

హిట్ 2 మూవీలో అడవి శేష్ కు జోడిగా బ్యూటిఫుల్ మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఈ సినిమా నుంచి ఉరికే ఉరికే అనే బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరో అడవి శేష్ హీరోయిన్ మీనాక్షి చౌదరి ఇద్దరూ కలిసి నాని ఆఫీస్ లో ఉరికే పాటకు డ్యాన్స్ చేశారు. ఈ వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు అడవి శేష్.

వీడియో వైరల్

అవును, నేను ఉరికే ఉరికే పాటకు డ్యాన్స్ చేశాను. డ్యాన్స్ చేయాడనికి కొంచెం సిగ్గుగా అనిపించింది. కానీ మీకోసం ఏదైనా చేస్తా అని రాసుకొచ్చాడు అడవి శేష్. దీంతో ఈ వీడియో వైరల్ అయింది. తాజాగా ఈ వీడియోపై నాని స్పందించాడు. అడవి శేష్ ట్వీట్ కు రీట్వీట్ చేస్తూ "నా ఆఫీస్ ను ఇలా కూడా వాడొచ్చా.." అని అడవి శేష్, మీనాక్షి చౌదరిని ట్యాగ్ చేశాడు నాని. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X