నాని హీరో అయ్యి పదేళ్లయింది: పడుతూ లేస్తూ నేచురల్ స్టార్‌గా!

By Bojja Kumar

నాని హీరో అయ్యి పదేళ్లయింది. సరిగ్గా దశాబ్దం క్రితం సెప్టెంబర్ 5న 'అష్ట చెమ్మా' సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన నాని వరుస విజయాలు అందుకుంటూ, తన పెర్ఫార్మెన్స్‌తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుని నేచురల్‌స్టార్‌గా ఎదిగాడు. ఈ పదేళ్ల కాలంలో నాని 20కి పైగా చిత్రాల్లో నటించారు. అందులో కొన్ని పరాజయాలు ఉన్నప్పటికీ ఎక్కువ సక్సెస్ రేటుతో చిన్న నిర్మాతలకు మినిమమ్ గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు.

ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో క్లాప్ బాయ్‌గా కెరీర్ మొదలు పెట్టిన నాని... ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా కొన్ని సినిమాలకు పని చేశాడు. వాస్తవానికి దర్శకుడు కావాలనే లక్ష్యంతో వచ్చిన నాని... అవకాశాలు కలిసి రావడంతో నటనవైపు వచ్చి తన సత్తా నిరూపించుకున్నాడు. సీనియర్ హీరోలు, స్టార్ హీరోల వారసుల ఆధిపత్యం కొనసాగే తెలుగు ఇండస్ట్రీలో నాని తనదైన టాలెంటుతో అవకాశాలు అందిపుచ్చుకున్నారు.

నాని నటించిన తొలి మూవీ 'అష్ట చెమ్మా' హిట్ అయినప్పటికీ ఆ తర్వాత వచ్చిన రైడ్, స్నేహితుడు పరాజయం పాలయ్యాయి. ఆ తర్వాత భీమిలి కబడ్డీ జట్టు, అలా మొదలైంది, పిల్ల జమిందార్, ఈగ లాంటి హిట్స్‌తో తన రేంజి మరింత పెంచుకోవడంతో పాటు తనకంటూ ప్రత్యేకమైన ఆడియన్స్‌ను ఏర్పరచుకున్నాడు.

Nani completes10 Years in Tollywood

ఒకానొక సమయంలో వరుస ప్లాపులతో నాని వెనకబడిపోయినా.... డబుల్ హ్యాట్రిక్ విజయాలతో తనకు తిరుగులేదని నిరూపించుకోవడంతో పాటు స్టార్ హీరోల సరసన చేరిపోయాడు. అతడు నటించిన భలే భలే మగాడివోయ్, నేను లోకల్, ఎంసీఏ చిత్రాలు వసూళ్ల పరంగా మంచి ఫలితాలనిచ్చాయి.

ఈ పదేళ్లలో ఆయన ఎన్నో వైవిధ్యభరితమైన కథలను .. విలక్షణమైన పాత్రలను చేసి శభాష్ అనిపించుకున్న నాని 'బిగ్ బాస్ 2' షోకు హోస్ట్‌గా ఎంట్రీ ఇవ్వడం ద్వారా బుల్లితెరపై కూడా తన సత్తా చాటుతున్నారు. నాని ప్రస్తుతం నటిస్తున్న విషయానికొస్తే.. నాగార్జునతో కలిసి 'దేవదాస్' అనే మల్టీస్టారర్ మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత 'జెర్సీ' అనే చిత్రంలో నటించబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X