For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫీల్డర్స్‌ లేని గ్రౌండ్‌లో ఫోర్‌ కొడితే కిక్కు ఉంటుందా? సక్సెస్ మీట్‌లో నాని ఎమోషనల్

|

నేచురల్‌ స్టార్‌ నాని, వెర్సటైల్‌ డైరెక్టర్‌ విక్రమ్‌ కె.కుమార్‌ల కాంబినేషన్‌లో మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌(సివిఎం) నిర్మించిన ఫుల్‌ లెంగ్త్‌ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ 'నాని'స్‌ గ్యాంగ్‌ లీడర్‌'. అనిరుధ్‌ రవిచంద్రన్‌ ఈ సినిమాకు సంగీతం అందించారు. ప్రియాంక అరుళ్ మోహన్‌ హీరోయిన్‌. 'ఆర్‌ఎక్స్‌100' ఫేమ్‌ కార్తికేయ ఈ చిత్రంలో ఒక ప్రధాన పాత్ర పోషించారు. సెప్టెంబర్‌ 13న వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ అయ్యి ఆడియన్స్‌ నుండి సూపర్‌ రెస్పాన్స్‌తో మంచి కలెక్షన్లు సాధిస్తుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌ అన్నపూర్ణ సెవెన్‌ ఎకర్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో....

Nani Speech At Gang Leader Movie Press Meet
నేను లోకల్ మూవీలో

నేను లోకల్ మూవీలో

నేచురల్‌ స్టార్‌ నాని మాట్లాడుతూ.. నేను లోకల్‌ సినిమాలో 'ఫీల్డర్స్‌ లేని గ్రౌండ్‌లో ఫోర్‌ కొడితే కిక్కే ఉండదు' అనే ఒక డైలాగ్‌ ఉంది. ఆ డైలాగ్‌ ఎడిటింగ్‌లో తీసేశాం కానీ ఇప్పుడు వాడాలనిపిస్తుంది. ఎందుకంటే రిలీజ్‌ రోజు రకరకాల విషయాలు మమ్మల్ని భయపెట్టాయి. ఎన్ని అడ్డంకులు ఉన్నా ప్రతి షోకి గ్రాఫ్‌ అలా పైకి వెళ్ళింది. ఈరోజు మార్నింగ్‌ షోస్‌ ఇంకా స్ట్రాంగ్‌గా స్టార్ట్‌ అయ్యాయి అని నాని తెలిపారు.

సినిమా మాట్లాడుతుంది

సినిమా మాట్లాడుతుంది

గ్యాంగ్ లీడర్ సినిమా గురించి ఇప్పటిదాకా మేము మాట్లాడాము. ఇక నుంచి సినిమా మాట్లాడుతుంది. గ్యాంగ్‌లీడర్‌ సినిమాను ఇంతలా ఓన్‌ చేసుకొని ఇంత మంచి రెస్పాన్స్‌ ఇచ్చిన ప్రతి ఒక్కరికీ థాంక్స్‌. సినిమా రిలీజైనప్పటి నుంచి సోషల్‌ మీడియాలో అద్భుతమైన రెస్పాన్స్‌ వస్తోంది. ప్రతి ఒక్కరి పెర్ఫామెన్స్‌కి ఒక ఎమొర్టికన్‌ వాడుతున్నారు. ఇది ఒక నిజమైన గెలుపుగా భావిస్తున్నాం అని నాని పేర్కొన్నారు.

కార్తీకేయ ఫెర్ఫార్మెన్స్

కార్తీకేయ ఫెర్ఫార్మెన్స్

గ్యాంగ్ లీడర్ సినిమాలో ప్రతి రివ్యూలోను కార్తికేయ పెర్ఫామెన్స్‌ని, వెన్నెల కిషోర్‌ కామెడీని అంతగా మెచ్చుకుంటున్నారు. సినిమా రిలీజ్‌ అవ్వగానే ఒకటి నోటీస్‌ చేశాను ప్రియాంక అరుళ్ మోహన్‌ ఫ్యాన్‌ క్లబ్‌ను క్రియేట్‌ చేశారు. ఫస్ట్‌ డేనే ఫ్యాన్‌ క్లబ్‌ ఏర్పాటు చేయడం మంచి విషయం. ప్రియాంక మంచి హీరోయిన్‌గా పేరు తెచ్చుకొంటుంది అని నాని అన్నారు.

థియేటర్లలో మంచి రెస్పాన్స్

థియేటర్లలో మంచి రెస్పాన్స్

గ్యాంగ్ లీడర్‌ సినిమాతో మైత్రి మూవీ మేకర్స్‌కి మరో హిట్‌ పడింది అనే మెస్సేజ్‌ చూసి హ్యాపీగా ఫీల్‌ అయ్యాను. మల్లికార్జున థియేటర్‌లో ఫ్యామిలీస్‌ సినిమాను ఎంతగా ఎంజాయ్‌ చేస్తున్నారు అనేది నా కజిన్‌ ఒక వీడియో క్లిప్‌ తీసి పంపింది. రిలీజ్‌ టెన్షన్ లేకుండా మాకు ఇంతటి పాజిటివిటీని ఇచ్చిన ప్రతి ఒక్కరికీ థాంక్స్‌ అని నాని పేర్కొన్నారు.

English summary
Nani's latest movie Gang Leader is set to release in September 13th. As part of the promotion, A song from movie is released on August 15th, Which got good response. This movie made Rs.28 crores overall business. After release, Movie getting good response from audience.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more