ప్రభాస్, చిరంజీవి మధ్యలో ఇరుక్కున్న నాని.. మరోసారి నిరాశ.. త్వరలోనే అధికారిక ప్రకటన

తన సహజ సిద్ధమైన నటనతో తెలుగు వారి మనసు దోచిన హీరోల్లో నాని ఒకడు. స్వయంకృషితో సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టి అనతి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. ఈ క్రమంలోనే నేచురల్ స్టార్ అని కూడా బిరుదును దక్కించుకున్నాడు. నటన, బావోద్వేగాలు పండించడంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్న ఈ యంగ్ హీరో కెరీర్ మంచిగానే సాగిపోతోంది. ఈ నేపథ్యంలో వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇందులో భాగంగా ప్రస్తుతం విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో 'గ్యాంగ్ లీడర్' అనే సినిమా చేస్తున్నాడు.

గ్యాంగ్ లీడర్‌కు మంచి స్పందన

గ్యాంగ్ లీడర్‌కు మంచి స్పందన

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో నానికి జోడీగా ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తోంది. అలాగే ‘ఆర్ఎస్ 100' హీరో కార్తికేయ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. వీరితో పాటు ప్రియాంక, లక్ష్మి, శరణ్య, అనీష్‌ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిశోర్‌, జైజా, సత్య తదితరులు నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, సాంగ్‌లకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ప్రభాస్ సాహోతో వెనక్కి

ప్రభాస్ సాహోతో వెనక్కి

‘గ్యాంగ్ లీడర్' షూటింగ్ ప్రారంభోత్సవం రోజు ఆగస్టు 30న విడుదల చేస్తామని చెప్పిన చిత్ర యూనిట్.. ఆ తర్వాత సినిమాను వాయిదా వేసింది. దీనికి కారణం ప్రభాస్ నటించిన ‘సాహో' ఆగస్టు 15 నుంచి 30కి మారడమే. దీంతో నాని సినిమాను సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ప్రత్యేకంగా పోస్టర్లు కూడా విడుదల చేశారు.

 అదే రోజు మెగా హీరో సినిమా

అదే రోజు మెగా హీరో సినిమా

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజా చిత్రం ‘వాల్మీకి'. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో వచ్చిన తమిళ సూపర్ హిట్ చిత్రం ‘జిగర్తాండ'కు రీమేక్‌గా వస్తున్న ఈ సినిమాను హరీశ్ శంకర్ తెరకెక్కిస్తున్నాడు. 14 రీల్స్ ప్లస్ బ్యాన‌ర్‌పై రామ్ ఆచంట‌, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వ‌రుణ్ తేజ్ గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించనున్నాడు. అలాగే, త‌మిళ హీరో అధ‌ర్వ ముర‌ళి కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. పూజా హెగ్డే, మృణాళిని ర‌వి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరోసారి నిరాశను మిగిల్చారు

మరోసారి నిరాశను మిగిల్చారు

గ్యాంగ్ లీడర్‌ను సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ తేదీన కూడా సినిమా విడుదల కావడం లేదని తెలుస్తోంది. దీనికి కారణం కొంత వర్క్ మిగిలి ఉండడమేనని సమాచారం. షూటింగ్ దాదాపుగా పూర్తయినప్పటికీ ప్యాచ్ వర్క్ కొంచెం మిగిలి ఉందట. దీనికి తోడు ప్రమోషన్ కార్యక్రమాలు చేయడానికి కూడా సమయం సరిపోదు. ఈ కారణంగానే ‘గ్యాంగ్ లీడర్'ను వాయిదా వేయాలని భావిస్తున్నారట.

చిరంజీవి వల్ల ఆలోచనలో పడిపోయారట

చిరంజీవి వల్ల ఆలోచనలో పడిపోయారట

సాహోతో మొదటిసారి వాయిదా పడిన గ్యాంగ్ లీడర్.. మరోసారి వెనక్కి వెళ్లిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరీ ఎక్కువ గ్యాప్ కాకుండా సెప్టెంబర్ 20న ఈ సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారట. ఇంకొంచెం లేట్ అయితే.. చిరు సినిమా ‘సైరా నరసింహా రెడ్డి' విడుదల అవుతుంది. అప్పుడు తమ సినిమాకు ఇబ్బందులు ఉంటాయని దాని కంటే పది రోజుల ముందు రావాలని భావిస్తున్నారట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుందని టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X