దసరా 2 హీరోయిన్ పై క్లారిటీ..! ఇక హ్యాట్రిక్ హిట్ కన్ఫామ్.. !?

టాలీవుడ్ లో తన నటనతో నేచురల్ స్టార్‌ గుర్తింపు పొందిన యాక్టర్ నాని. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా కథ నచ్చితే చాలు సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్నాడు. సినిమా సినిమాకు వెరియేషన్ కనబర్చుతూ.. ప్రయోగాలూ చేస్తున్నాడు. అలా.. నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన పక్కా మాస్ మూవీ 'దసరా'. ఇందులో మహానటి కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. ఎస్‌ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించగా.. సంతోష్ నారాయన్ సంగీతం అందించాడు. ఈ మూవీలో దీక్షిత్ శెట్టి, సముద్రఖని, సాయి కుమార్, పూర్ణ తదితరులు లీడ్ రోల్స్ లో నటించారు. లో బడ్జెట్ మూవీ అయినా.. మూవీ మేకర్స్ కు కాసుల వర్షం కురిపించింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఏకంగా రూ. 113 కోట్లు కలెక్ట్ చేసింది. అటు డైరెక్టర్ కెరీర్ లోనూ.. ఇటు హీరో నాని కెరీర్ లో మొదటిసారి 100 కోట్ల కలెక్షన్ క్లబ్ లో చేరిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది.

హీరో నాని కెరీర్లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ మూవీకి సిక్వెల్ ప్రకటించిన విషయం తెలిసిందే. దసరా 1 పూర్తిగా తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సాగగా.. పార్ట్ 2
సికింద్రాబాద్ నేపథ్యంలో జరిగే కథగా తెరకెక్కించనున్నారట. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్స్ పూర్తయినట్టు సమాచారం. త్వరలోనే సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది. ఈ చిత్రంలో నానికి జోడిగా బాలీవుడ్ అందాల రాసి జాన్వీ కపూర్ ను ఎంపిక చేసినట్టు వార్తలు వచ్చాయి. కానీ, ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు మరోసారి పాత టీమ్ నే రిపీట్ చేయాలని భావిస్తున్నారట మూవీ మేకర్స్. తొలి పార్ట్ లో కీర్తి సురేష్ నటన అదుర్స్. పల్లెటూర్ అమ్మాయిగా ఇరగదీసింది. తొలుత కొత్త హీరోయిన్ తీసుకుంటే బాగుంటుందని భావించినా.. ఓల్డ్ హీరోయిన్ నే ఈ కథకు కరెక్ట్ అని కీర్తి సురేష్ నే తీసుకుంటారని టాక్. కానీ అధికారికంగా ప్రకటన రాలేదు. ఇదే నిజమైతే.. మరోసారి నానితో కీర్తి కలిసి నటించబోతున్నారు.

Nani Keerthy Suresh combination repeat dasara 2

ఇప్పటికే వీరిద్దరూ నేను లోకల్, దసరా నటించి భారీ సక్సెస్ కొట్టేశారు. వీరి కాంబో సెట్ అయితే... ఈ సారి హ్యాట్రిక్ కన్ఫామ్ అని మూవీ లవర్స్ భావిస్తున్నారు.
న్యాచులర్ స్టార్ నాని తన నటనతో ఆకట్టుకుంటుంటే.. కీర్తి సురేష్ కూడా ఏ మాత్రం తగ్గకుండా తన అందం, అభినయంతో ఫ్యాన్స్ కట్టిపడేస్తుంది. ఈ సక్సెస్ జోడీ రీపిట్ అయితే.. రిజల్ట్ కూడా అదే రేంజ్ లో ఉంటుందని ఫ్యాన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే.. మొదటి భాగానికి సంగీతం అందించిన సంతోష్ నారాయణ్ మాత్రం ఈ చిత్రం నుండి తప్పుకున్నట్టు సమాచారం. ఈ క్రేజీ సిక్వెల్ ను దాదాపు రూ.120 నుండి రూ. 150 కోట్ల బడ్జెట్ తో నిర్మించబోతున్నారట నిర్మాత సుధాకర్ చెరుకూరి.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం నాని సరిపోదా శనివారం అనే మూవీ రిలీజ్, ప్రమోషన్లలో బిజీబిజీగా ఉన్నాయి. భారీ అంచనాలతో విడుదలవుతున్న ఈ మూవీ రేపు (ఆగస్టు 29) థియేటర్లలో రిలీజ్ అయ్యేందుకు రెడీ అయింది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరక్కెకిన ఈ మూవీకి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించారు. ఈ మూవీపై హైప్ విపరీతంగా ఉంది. ప్రమోషన్లను కూడా మూవీ టీమ్ జోరుగా చేస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా జోరుగా సాగుతున్నాయి.

More from Filmibeat

Read more about: dasara nani srikanthodela
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X