‘టక్ జగదీష్’పై నాని కీలక నిర్ణయం: డైరెక్టుగా అలానే రిలీజ్ చేయబోతున్నారట
సహజ సిద్ధమైన నటనతో తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందుతూ స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు నాని. సినిమా సినిమాకూ యాక్టింగ్‌లో పరిణితిని చూపిస్తూ.. నేచురల్ స్టార్ అనే బిరుదుకు వంద శాతం న్యాయం చేస్తున్నాడు. కెరీర్ ఆరంభం నుంచే వరుసగా సినిమాలు చేస్తూ సత్తా చాటుతోన్న అతడు.. ప్రస్తుతం 'టక్ జగదీష్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దంగా ఉన్నాడు. దీన్ని ఏప్రిల్ 23న విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా రిలీజ్‌ను వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకొచ్చింది.
'నిన్ను కోరి' వంటి సక్సెస్‌ఫుల్ మూవీ తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో నాని నటిస్తోన్న చిత్రమే 'టక్ జగదీష్'. ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. కరోనా వైరస్ ప్రభావం పెరగడంతో ఈ మూవీ విడుదలను ఆపేశారు. దీంతో ఇది త్వరలోనే ఓటీటీలో విడుదల కాబోతుందని ప్రచారం జరుగుతోంది. అయితే, తాజా సమాచారం ప్రకారం.. దీన్ని ఓటీటీలో విడుదల చేసేందుకు నాని సుముఖంగ లేడట. ఎలాగైనా ఈ చిత్రాన్ని థియేటర్‌లోనే రిలీజ్ చేయాలని భావిస్తున్నాడట. కొంత ఆలస్యమైనా పర్వాలేదని నిర్మాతలకు స్పష్టం చేసినట్లు ఓ న్యూస్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.

'టక్ జగదీష్' మూవీ ఎమోషనల్‌గా సాగే కుటుంబ కథా చిత్రమని ఇటీవల విడుదలైన పోస్టర్లు, టీజర్‌తో అర్థం అయింది. అందుకే ఈ సినిమాపై నాని కాన్ఫిడెంట్‌గా ఉన్నాడని అంటున్నారు. ఇక, ఈ సినిమాను షైస్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, పెద్ది హరీష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో టాలెంటెడ్ హీరోయిన్లు ఐశ్వర్య రాజేష్, రీతూ వర్మ నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











