Paradise Glimpse Review: పుష్ప 2 దారిలో ప్యారడైజ్.. అల్లు అర్జున్ స్ట్రాటజీని నాని టార్గెట్!

ఇప్పుడు తెలుగు సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో ఏ రేంజ్ లో అదరగొడుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒకదాన్ని మించిన ఒక సాలిడ్ కంటెంట్ అది కూడా క్రేజీ జానర్స్ అన్నీ మన వాళ్ళు ట్రై చేస్తూ భారీ వసూళ్లు అందిస్తూ ఇండియన్ సినిమా దగ్గర భారీ రెవెన్యూలు అందిస్తూ వస్తున్నాయి.

ఇక ఇదిలా ఉండగా మన తెలుగు సినిమాల్లో దాదాపు అన్నీ పాన్ ఇండియా లెవెల్లోనే ఆడియెన్స్ ని అలరించేందుకు వస్తున్నాయి. కాగా ఇది వరకు పాన్ ఇండియా లెవెల్లో అంటే మాగ్జిమమ్ 5 భాషల్లో మాత్రమే సినిమాలు వచ్చేవి. ఒకప్పుడు పాన్ ఇండియా సినిమా లెక్కలు మొత్తం 4000 థియేటర్స్, అలాగే తెలుగు, తమిళ్, డెఫినెట్ గా హిందీలో వీటి తర్వాత కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేస్తే తప్ప అది పాన్ ఇండియా సినిమా అనిపించుకునేది కాదు.

nani rare feat with the paradise after allu arjun pushpa 2

కాగా ఇపుడు కూడా ఈ అన్ని భాషల్లో వస్తున్నాయి కానీ థియేటర్స్ సంఖ్య అలానే ఉండాలి అనే కొలమానం లేదు. ఇంకా చెప్పాలంటే మెయిన్ గా హింది మార్కెట్ ని టార్గెట్ పెట్టుకొని వచ్చిన సినిమాలు కూడా పాన్ ఇండియా సినిమాలు అయ్యాయి. కానీ వీటికి అతీతంగా మాత్రం కొన్ని సినిమాలు ఇండియా వైడ్ గా మరికొన్ని భాషల్లో టచ్ చేస్తున్నాయి.

కాగా పాన్ ఇండియా లెవెల్లో పైన చెప్పిన 5 భాషల్లో మాత్రమే కాకుండా మరో భాషలో కూడా తన సినిమా రిలీజ్ చేసి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సెన్సేషనల్ సీక్వెల్ చిత్రం "పుష్ప 2 ది రూల్" తో ట్రై చేసి బన్నీ ఇండియన్ సినిమా దగ్గర ఫస్ట్ ఎవర్ రిలీజ్ చేసాడు. మరి ఇదే బెంగాలీ రిలీజ్. మనవాళ్ళు తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మళయాళ భాషలలో చేస్తే ఇవి కాకుండా బెంగాలీ కూడా అడిషనల్ గా బన్నీ టచ్ చేసాడు.

nani rare feat with the paradise after allu arjun pushpa 2

మరి ఇపుడు అల్లు అర్జున్ తర్వాత ఈ భాషలో రిలీజ్ కి ఒక్క నాచురల్ స్టార్ నాని రెండో హీరోగా అడుగు వేయడం గమనార్హం. రీసెంట్ గా హిట్ 3 అనుకుంటే దానికి మించిన లెవెల్లో ఇపుడు ది ప్యారడైజ్ గ్లింప్స్ చూసి ఒకొక్కరికి మెంటల్ వచ్చింది. కాగా ఈ సినిమానే నాని పాన్ ఇండియా భాషలు మాత్రమే కాకుండా బెంగాలీలో కూడా అనౌన్స్ చేశారు.

దీనితో మొత్తం 6 భాషల్లో రిలీజ్ అవుతున్న రెండో సినిమాగా ది ప్యారడైజ్ నిలిచింది. ఇలా ఇండియన్ సినిమా దగ్గర రెండో హీరోగా కూడా నాని రేర్ ఫీట్ అందుకున్నాడని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రాన్ని నాని హిట్ సినిమా దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తుండగా 2026లో మార్చ్ 26న ఒక్క ఈ 6 భాషల్లోనే కాకుండా పలు ఇంటర్నేషనల్ భాషల్లో కూడా ఈ చిత్రం రిలీజ్ కి రాబోతుంది.

More from Filmibeat

Read more about: nani pushpa 2 allu arjun
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X