అరుదైన మైలురాయిని చేరుకున్న నాని: ఆ రెండింట్లోనూ అదే రేంజ్‌లో దూకుడు
సినీ బ్యాగ్రౌండ్ లేకుండానే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. చాలా తక్కువ సమయంలోనే బడా హీరోగా ఎదిగిపోయాడు నేచురల్ స్టార్ నాని. దీనికి కారణం సహజ సిద్ధమైన నటనతో ప్రతి సినిమానూ వన్ మ్యాన్ షోలా మార్చుకోవడమే. ఫలితంగా ఎన్నో హిట్లను తన ఖాతాలో వేసుకోవడంతో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సైతం భారీ స్థాయిలో సంపాదించుకున్నాడు. అందుకే మరింత ఉత్సాహంగా వరుస సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం చేతి నిండా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్న నాని.. తాజాగా ఓ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. తద్వారా మంచి ఘనతను సొంతం చేసుకున్నాడు.
నేచురల్ స్టార్ నాని సినిమాల పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటాడన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటుంటాడు. అదే సమయంలో ఫొటోలు, వీడియోలను కూడా వదులుతున్నాడు. దీంతో నానిని ఫాలో అయ్యే సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో నాలుగు మిలియన్ల ఫాలోవర్ల మార్కును చేరుకున్నాడు నాని. దీంతో ఈ ఘనతను అందుకున్న తక్కువ మంది టాలీవుడ్ హీరోల జాబితాలో చోటు దక్కించుకున్నాడు.

ఇన్‌స్టాలోనే కాదు.. నానికి ట్విట్టర్‌లో కూడా 4 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. అలాగే, ఫేస్‌బుక్‌లో 5.5 మిలియన్ల మంది అతడిని అనుసరిస్తున్నారు. అందుకే అతడు మరింత ఉత్సాహంగా సోషల్ మీడియాలో అప్‌డేట్లు చేస్తున్నాడు. ఇక, నాని మాత్రం ఇప్పటికే శివ నిర్వాణ దర్శకత్వంలో 'టక్ జగదీష్' అనే సినిమాను చేశాడు. ఇది విడుదలకు సిద్ధంగా ఉంది. దీనితో పాటు 'శ్యామ్ సింగరాయ్', 'అంటే.. సుందరానికీ' అనే సినిమాను సైతం చేస్తున్నాడు. వీటితో పాటు మరిన్ని ప్రాజెక్టులను పట్టాలెక్కించేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసేశాడు.


Click it and Unblock the Notifications











