నాని కెరీర్‌లో రికార్డుగా V మూవీ.. నేచురల్ స్టార్ రెమ్యునరేషన్, ఆస్తుల విలువ ఎంతో తెలుసా?
కరోనావైరస్ వ్యాప్తితో కుదేలైన భారతీయ సినిమా పరిశ్రమ ఇప్పుడిప్పుడే కోలుకొంటున్నట్టు కనిపిస్తున్నది. ఇప్పటికే సినీ, టెలివిజన్ రంగాలకు సంబంధించిన షూటింగులు మొదలయ్యాయి. ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్లు ఓపెన్ అయ్యే సూచనలు కనిపించకపోవడంతో పలు సినిమాలను ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అలా తెలుగు సినిమా పరిశ్రమలో నాని, సుధీర్ బాబు లాంటి భారీ తారాగాణం, బడ్జెట్ రూపొందిన V చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా రిలీజ్ చేయాలనే నిర్ణయం తీసుకొన్నారు. ఈ క్రమంలో ఓ వెబ్‌సైట్ అంచనా ప్రకారం నాని రెమ్యునరేషన్, ఆస్తుల విలువ ఎంతంటే..

25 చిత్రాల మైలురాయితో నాని
నేచురల్ స్టార్‌గా పేరు పొందిన నాని కెరీర్‌లో V మూవీ ప్రత్యేకమైనదిగా చెప్పుకొవచ్చు. రాధా గోపాలం చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించిన నాని.. ఆ తర్వాత నటుడిగా మారారు. అలా మొదలైంది, ఈగ, జెంటిల్మన్, భలే భలే మొగాడివోయ్, జెర్సీ సినిమాలతో దూసుకెళ్తున్నాడు. తక్కువ కాలంలోనే నాని 25 చిత్రాలు పూర్తి చేసుకోవడం విశేషంగా మారింది.

అమెజాన్ ప్రైమ్‌లో V మూవీ
ప్రస్తుతం నానీ నటించిన V చిత్రం కెరీర్‌లో 25వ మూవీ కావడంతో ఆయనకు ప్రత్యేకంగా మారింది. ఈ సినిమాతో థియేటర్‌లో కలువాలని భావించినప్పటికీ కరోనా వైరస్ కారణంగా సాధ్యపడకపోవడం కొంత నిరాశను కలిగించిందనే చెప్పారు. త్వరలో విడుదల కానున్న టక్ జగదీష్ చిత్రంతో మళ్లీ థియేటర్లలో కలుద్దాం. ప్రస్తుతానికి అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ఓటీటీ ఫ్లాట్‌ఫాం మీద కలుద్దాం అని చెప్పారు.

V మూవీ కోసం రూ.7 కోట్ల పారితోషికం
తన కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచిన V మూవీ చిత్రం కోసం నాని రూ.7 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకొన్నారని ప్రముఖ ఆంగ్ల వెబ్ సెట్ తన కథనంలో పేర్కొన్నది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న నాని ఇప్పుడు టాలీవుడ్‌లో నిర్మాతలకు మోస్ట్ డిపెండబుల్ హీరోగా నిలిచారు. V చిత్రంతో నాని మరో హిట్టు ఖాతాలో వేసుకోవడం ఖాయమనే మాట సినీ వర్గాల్లో వినిపిస్తున్నది.

నాని నికర ఆస్తులు 40 కోట్లు అంటూ అంచనా
టాలీవుడ్‌లో 25 చిత్రాలు పూర్తి చేసిన హీరోగా నాని నికర ఆస్తుల విలువను జాతీయ వెబ్‌సైట్ అంచనా వేసింది. ఆయన ఆస్తుల విలువ దాదాపు సుమారు రూ.40 కోట్లుగా అంచనా వేసింది. అయితే ఈ లెక్కలకు అధికారికంగా స్పష్టత లేకపోవడంతో అంచనాగానే మిగిలిపోయింది.
Recommended Video

ఇంద్రగంటి, దిల్ రాజు కాంబినేషన్‌లో
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న V మూవీకి ఇంద్రగంటి మోహన్ దర్శకత్వం వహించారు. నానితోపాటు సుధీర్ బాబు, పోసాని మురళీ కృష్ణ, నివేదా థామస్, అదితి రావు హైదరీ తదితరులు నటించారు. అయితే ఈ సినిమాలో నాని తన ఇమేజ్‌కు భిన్నంగా నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో నటించడం గమనార్హం.


Click it and Unblock the Notifications











