టాలీవుడ్‌లో టాప్ ప్లేస్‌కు హీరో నాని: ఆ హీరోను వెనక్కి నెట్టడంతో ఆల్‌టైం రికార్డు
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఏమాత్రం బ్యాగ్రౌండ్ లేకుండానే వచ్చినా.. తనదైన శైలి సహజ సిద్ధమైన నటనతో తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు నేచురల్ స్టార్ నాని. అదే సమయంలో స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నాడు. అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడని ఈ టాలెంటెడ్ హీరో.. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. అయితే, ఆ మధ్య కొన్ని వరుస పరాజయాలతో సతమతం అయిన అతడు.. గత ఏడాది విడుదలైన 'శ్యామ్ సింగ రాయ్' మూవీతో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో ఫ్యూచర్ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నాడు.
ఫలితాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసే నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం 'అంటే.. సుందరానికీ' అనే సినిమాను పూర్తి చేసుకున్నాడు. 'మెంటల్ మదిలో', 'బ్రోచేవారెవరురా' వంటి ఆసక్తికరమైన సినిమాలను తెరకెక్కించి.. ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న వివేక్ ఆత్రేయ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. గతంలో చూడని ఓ కొత్త కాన్సెప్ట్‌తో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మలయాళ ముద్దుగుమ్మ 'రాజా రాణి' ఫేం నజ్రియా ఫహాద్ హీరోయిన్‌గా చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తైంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి.

నేచురల్ స్టార్ నాని నటిస్తోన్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'అంటే.. సుందరానికీ' మూవీని జూన్ 10న ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇందులో నానిని బ్రాహ్మణుడిగా చూపించారు. ముందుగా అతడి ఫ్యామిలీ, వ్యక్తిత్వం గురించి పరిచయం చేసిన తర్వాత.. హీరోయిన్ నజ్రియాను క్రిస్టియన్ అమ్మాయిగా పరిచయం చేశారు. రెండు వేరు వేరు మతాలకు చెందిన వీళ్లిద్దరూ ప్రేమలో పడడం దాన్ని కుటుంబ సభ్యులు వ్యతిరేకించడం వంటివి ఫన్నీగా చూపించారు. ఇక, చివర్లో మాత్రం హీరోకు ఏదో పెద్ద సమస్య ఉందని సస్పెన్స్‌ను పెంచారు.
వినూత్న కథాంశంతో రాబోతున్న 'అంటే.. సుందరానికీ' ట్రైలర్‌కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కింది. ఫలితంగా ఈ వీడియోకు రికార్డు స్థాయిలో వ్యూస్ దక్కాయి. 24 గంటలు ముగిసే సమయానికి ఈ ట్రైలర్‌కు ఏకంగా 9.39 మిలియన్ వ్యూస్‌తో పాటు 196K లైకులు వచ్చాయి. దీంతో టాలీవుడ్‌లోని టైర్ 2 హీరోల జాబితాలో ఎక్కువ వ్యూస్ సాధించిన ట్రైలర్‌గా ఇది ఆల్‌టైం రికార్డును క్రియేట్ చేసింది. దీంతో అప్పటి వరకూ టాప్‌లో ఉన్న దగ్గుబాటి రానా 'అరణ్య' (8.32 మిలియన్ వ్యూస్) రెండో స్థానానికి పడిపోయింది. లైకుల పరంగా చూస్తే 'అంటే' ట్రైలర్ ఎనిమిదో స్థానంలో ఉంది.
'అంటే.. సుందరానికీ' మూవీలో నేచురల్ స్టార్ నాని సరికొత్త గెటప్‌తో కనిపించబోతున్నాడు. ఇక, ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. అలాగే, వివేక్ సాగర్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చుతున్నాడు. ఇందులో ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రంపై ఆరంభం నుంచే అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











