జెర్సీ షూటింగ్ కంప్లీట్.. నాని క్రికెటర్ అర్జున్‌గా వస్తున్నాడు!
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం జెర్సీ. మళ్ళిరావా ఫేమ్ గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నాని ఈ చిత్రంలో క్రికెటర్ పాత్రలో నటిస్తుండడం ఆసక్తి రేపుతోంది. ఈ చిత్రంలో నాని పాత్ర పేరు అర్జున్. ఇటీవల విడుదలైన టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. డబుల్ హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్న నానికి గత ఏడాది కృష్ణార్జున యుద్ధం, దేవదాస్ చిత్రాలు బ్రేక్ వేసాయి. విభిన్నమైన కథతో వస్తున్న జెర్సీ చిత్రంపై నాని ఆశలు పెట్టుకుని ఉన్నాడు.
తాజాగా జెర్సీ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని నాని సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. లాస్ట్ షాట్ తర్వాత అంటూ చిత్ర యూనిట్ తో సెల్ఫీ తీసుకున్న ఫోటోని పోస్ట్ చేశాడు. శ్రద్దా శ్రీనాధ్ ఈ చిత్రంలో నానికి హీరోయిన్ గా నటిస్తోంది. మార్చిలో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసి ఏప్రిల్ 5న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి.

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో జెర్సీ చిత్రం తెరకెక్కుతోంది. సంచలన సంగీత దర్శకుడు అనిరుద్ ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నాడు. జెర్సీ చిత్రం తర్వాత నాని గ్యాంగ్ లీడర్ చిత్రంలో నటించబోతున్నాడు. క్రేజీ దర్శకుడు విక్రమ్ కుమార్ రూపొందించే ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది.


Click it and Unblock the Notifications











