జనవరి 1న క్రికెటర్ అర్జున్ మన ముందుకు.. నాని 'జెర్సీ' ఫస్ట్ లుక్!
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం జెర్సీ. మళ్ళిరావా ఫేమ్ గౌతమ్ తిన్ననూరు ఈ చిత్రనికి దర్శకుడు. వైవిధ్యమైన కాన్సెప్ట్ తో ఈ చిత్రం రూపొందుతున్నట్లు తెలుస్తోంది. నాని ఈ చిత్రంలో క్రికెటర్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ రోల్ కోసం నాని ఇప్పటికే క్రికెట్ క్రీడలో శిక్షణ తీసుకున్నాడు కూడా. నాని క్రికెటర్ గా నటిస్తుండడంతో ఉత్కంఠ నెలకొని ఉంది. ఈ చిత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఖరారైంది.
నూతన సంవత్సర కానుకగా జనవరి 1న ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నారు. జనవరి 1న అర్జున్ ని మీట్ అవండి అంటూ చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది. క్రికెట్ ఆటకు సంబందించిన జెర్సీలు, బ్యాటు ఈ లుక్ లో కనిపిస్తున్నాయి. నాని నటించబోతున్న పాత్ర పేరు అర్జున్. అర్జున్ క్రికెటర్ గా ఎలా మారాడు. ఎలాంటి విజయాలు సాధించాడు.. అతడి జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలు ఏంటి అనే ఉత్కంఠ నెలకొని ఉంది.

క్రీడా నేపథ్యంలో సాగే చిత్రాలకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ ఉంటుంది. నాని ఇప్పటికే కబాడీ నేపథ్యంలో భీమిలి కబడ్డీ జట్టు చిత్రంలో నటించాడు. ఇప్పుడు క్రికెటర్ గా మనముందుకు రాబోతున్నాడు. సంచలన సంగీత దర్శకుడు అనిరుద్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నాడు. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది.


Click it and Unblock the Notifications











