For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మెగాస్టార్ చిరంజీవితో కలిసి మీసం మెలేసిన నాని.. ఫొటో వైరల్

    |

    టాలీవుడ్ హీరో నేచురల్ స్టార్ నాని ఇలాంటి సినిమా చేసినా కూడా అందులో ఏదో ఒక కొత్త కాన్సెప్ట్ అయ్యేలా కథలను సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాడు. అతడి ఫ్లాప్ సినిమాలు కూడా కొన్నిసార్లు ఓ వర్గం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. ఇక ఇటీవల వచ్చిన శ్యామ్ సింగరాయ్ సినిమా కూడా మొదట కాస్త నెగిటివ్ టాక్ ను అందుకున్నప్పటికి ఆ తర్వాత బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో కలెక్షన్స్ అందుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది. టాక్సీవాలా దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన శ్యామ్ సింగరాయ్ సినిమాలో నాని రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించిన విషయం తెలిసిందే. ఇక సినిమా చూసిన చాలా మంది సినీ ప్రముఖులు చాలా పాజిటివ్ గా స్పందించారు.

    సినిమా చాలా బాగుంది అని, ఓ కొత్త తరహా ప్రేమ ప్రపంచంలోకి తీసుకు వెళ్లినట్లుగా ఉందని కూడా స్టార్ దర్శకులు ప్రశంసలు కురిపించారు. ఇక ఇటీవల మెగాస్టార్ చిరంజీవి కూడా శ్యామ్ సింగ్ సినిమాను ప్రత్యేకంగా వీక్షించినట్లుగా తెలుస్తోంది.. సినిమా చాలా బాగా నచ్చడంతో మెగాస్టార్ ప్రత్యేక నానిని పిలిపించి మరీ అభినందనలు తెలిపాడు. ఇక మెగాస్టార్ చిరంజీవితో ఒక ప్రత్యేకమైన సెల్ఫీ ఫోటో కూడా తీసుకొని దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఆ ఫోటోలో నాని మెగాస్టార్ చిరంజీవితో కలిసి మీసాలు మెలేసి నట్లుగా శ్యామ్ సింగరాయ్ స్టైల్ లో స్టిల్ ఇచ్చాడు. ఇక అభిమానులు కూడా ఆ ఫోటోను చూసి చాలా పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు.

    Nani selfie with Megastar chiranjeevi photo viral

    మెగాస్టార్ చిరంజీవి ఇటీవల కాలంలో ఎవరు మంచి సినిమాలను తెరపైకి తీసుకు వచ్చినా కూడా వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. అంతే కాకుండా కొత్త తరహా యువ దర్శకులకు కూడా అవకాశాలు ఇస్తున్నారు. ఇక రాహుల్ సాంకృత్యాన్ పనితనం నచ్చడంతో మెగాస్టార్ చిరంజీవి అతన్ని ప్రత్యేకంగా అభినందించినట్లుగా తెలుస్తోంది. శ్యామ్ సింగరాయ్ సినిమాలో నాని చేసిన రెండు పాత్రలకు కూడా మంచి గుర్తింపు లభించింది. ఇక సినిమాలో సాయిపల్లవి పాత్ర కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన విషయం తెలిసిందే. అంతేకాకుండా కృతి శెట్టి కూడా బోల్డ్ పాత్రలో నటించి ఆశ్చర్యపరిచింది.

    కృతి శెట్టి నానికి సంబంధించిన ఒక రొమాంటిక్ సన్నివేశం కూడా ఈ సినిమాలో హైలెట్గా నిలిచిన విషయం తెలిసిందే. మొత్తానికి ఈ సినిమాతో నాని మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేశాడు. ఎందుకంటే నాని చివరగా నటించిన రెండు సినిమాలు కూడా డైరెక్ట్ గా ఓటీటీ లో విడుదలైన విషయం తెలిసిందే. మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో చేసిన V సినిమాతో పాటు శివ నిర్వాణ దర్శకత్వంలో చేసిన టక్ జగదీష్ కూడా డైరెక్ట్ గా ఓటీటీ లోనే విడుదల అయ్యాయి. ఇక ఈ రెండు సినిమాలు కూడా దారుణమైన నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. ఇక ఈ సినిమాతో మాత్రం బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకోవడమే కాకుండా పాజిటివ్ టాక్ ను కూడా సొంతం చేసుకున్నాడు. మరి భవిష్యత్తులో రాబోయే సినిమాలు ఏ స్థాయిలో సక్సెస్ అవుతాయో చూడాలి.

    English summary
    Nani selfie with Megastar chiranjeevi photo viral
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X
    Desktop Bottom Promotion