నాకు అవార్డులు అక్కర్లేదు.. ఆ కోరిక అలా చచ్చిపోతున్నది.. ఫిలింఫేర్ అవార్డుల్లో నాని సెన్సేషనల్ కామెంట్స్

నేచురల్ స్టార్ నాని నటించిన దసరా చిత్రం ఫిలింఫేర్ అవార్డుల్లో హవా కొనసాగించింది. దాదాపు వివిధ కేటగిరిలో ఆరు అవార్డులను సొంతం చేసుకొని రికార్డు క్రియేట్ చేసింది. ఉత్తమ నటిగా కీర్తి సురేష్, ఉత్తమ నటుడిగా నాని, ఉత్తమ దర్శకుడిగా శ్రీకాంత్ ఓదెల, ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌గా సత్వన్ సూర్యన్, ఉత్తమ ప్రొడక్షన్ డిజైనర్‌గా అవినాష్ కోల్లా, ఉత్తమ కోరియోగ్రాఫర్‌గా ప్రేమ్ రక్షిత్‌కు అవార్డులు దక్కాయి. ఈ అవార్డుల కార్యక్రమంలో నాని ఎమోషనల్‌గా మాట్లాడుతూ..

నా కెరీర్ ఆరంభంలో నాకు ఎక్కువగా అవార్డులు గెలుచుకోవాలనే కోరిక ఉండేది. ఆ బలమైన కోరిక క్రమంగా తగ్గుతూ వస్తున్నది. నాకు అవార్డులు సంపాదించుకొవాలనే కోరిక ఇకలేదు. కానీ నాతోను, అలాగే నా సినిమాల్లో పనిచేసే దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు, నటీనటులు అవార్డులు గెలుచుకోవాలని కోరుకొంటున్నాను. కొత్తగా సినిమా పరిశ్రమలోకి వచ్చే యువ టాలెంట్‌ అవార్డులు గెలచుకొంటే.. అది నాకు చాలా సంతృప్తిని, ఉత్సాహాన్ని ఇస్తుంది అని నాని అన్నారు.

Nani sensational comments on Filmfare 2024 Awards Awards getting desire diminishing

తాజా ఫిలింఫేర్ దక్షిణాది అవార్డుల్లో నాతో సినిమాలు చేసిన దసరా దర్శకుడు శ్రీకాంత్, హాయ్ నాన్న డైరెక్టర్ శౌర్యు అవార్డులు గెలుచుకోవడం థ్రిల్లింగ్‌గా అనిపించింది. అవార్డులు కూడా నాతోపాటు అందుకోవడం ఒక మధురానుభూతి. నేను అవార్డుల కవర్ ఓపెన్ చేసి.. చదివి వారికి అవార్డులు ప్రకటించే అదృష్టం రావడం చాలా హ్యాపీగా ఉంది. వెంటనే ఆ కవర్లను కార్లో పెట్టించాను. వాటిని ఫ్రేమ్‌లు కట్టించుకొని ఇంట్లో పెట్టుకొంటాను అని నాని ఎమోషనల్ అయ్యారు.

నాతో సినిమాలు చేసే యూనిట్ సభ్యులు ఏదైనా సాధిస్తే అదే నాకు గొప్ప అవార్డు. వారి ప్రయాణంలో, కెరీర్ నిర్మాణంలో చిన్న ఇటుక రాయిని అయితే అంతకంటే సంతోషం ఏమి ఉండదు. 2023, 2024 సంత్సరాలు నాకు అత్యంత ప్రత్యేకమైనవి. దసరా, హాయ్ నాన్న నాకు అమితమైన ఆనందాన్ని ఇవ్వడంతో అంతకంటే స్పెషల్ ఏమీ కోరుకోవడం లేదు అని నాని అన్నారు.

శ్రీకాంత్‌తో మరో సినిమా చేయడానికి సిద్దం అవుతన్నాం. ఆ సినిమాతో మరిన్నీ అవార్డులు కొట్టేందుకు సిద్దం కావాలి. దసరాను మించిన విజయం సాధించాలి అని నాని అన్నారు. ఇదిలా ఉండగా, దసరా, హాయ్ నాన్న సినిమాల తర్వాత నాని నటిస్తున్న చిత్రం సరిపోదా శనివారం. ఈ సినిమా ఆగస్టు 29వ తేదీన రిలీజ్ అవుతున్నది.

More from Filmibeat

Read more about: nani dasara filmfare 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X