Remuneration: నానికి రికార్డు రెమ్యునరేషన్ .. ప్యారడైజ్ కి ఎన్ని కోట్ల పారితోషికం అంటే?
ఇటీవల తెలుగు సినిమా దగ్గర కొత్త కొత్త ప్రయోగాలు ఎక్కువ అవుతున్నాయి అని అందరికీ తెలిసిందే. కాగా ఈ ప్రయోగాల్లో ఒకింత బోల్డ్ నెస్ కూడా పెరుగుతూ వస్తుంది. ఒకప్పుడు ఈ తరహా అంశాల్లో కొంచెం జాగ్రత్తగానే మేకర్స్ ఉండే వారు కానీ జనం కూడా పలు అంశాల్లో శృతి మించినా కూడా చూస్తున్నారు అనే పాయింట్ తో కొన్ని డేరింగ్ డైలాగ్స్ కొన్ని ఊహించని బోల్డ్ సీన్స్ ని బిగ్ స్క్రీన్ సినిమాలపై కూడా పెట్టేస్తున్నారు.
ఇక ఇలా వచ్చిన చాలా సినిమాలు సెన్సేషనల్ హిట్స్ కూడా అయ్యాయి. కానీ లేటెస్ట్ గా వీటి అన్నిట్లో ఎక్స్ట్రీమ్ లెవెల్లోకి తీసుకెళ్ళిపోయిన సినిమా ఏదన్నా ఉంది అంటే అది నాచురల్ స్టార్ నాని నటిస్తున్న భారీ చిత్రం "ది ప్యారడైజ్" అని చెప్పి తీరాలి. కాగా ఈ సినిమా కోసం ఏకంగా మేకర్స్ తెలుగు సినిమా దగ్గర ఏ హీరో కానీ దర్శకుడు కానీ తీసుకోని బోల్డ్ అండ్ కాంట్రవర్సియల్ స్టెప్ ని తీసుకున్నారు.

కాగా హీరో పాత్రనే ల... కొడుకు అంటూ పరిచయం చేయడం టాలీవుడ్ లో ఒకొక్కరికి ఫ్యూజ్ లు ఎగిరిపోయేలా చేసింది. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాకి ముందు నాని నుంచి వచ్చిన హిట్ 3 టీజర్ చూసే అంతా షాకైతే ప్యారడైజ్ టీజర్ చూసి అంతకు మించి షాకయ్యారు. ఇదిలా ఉండగా ఇపుడు తెలుగు సినిమాలో వరుస హిట్స్ తో మినిమమ్ గ్యారెంటీ అనే రేంజ్ మార్కెట్ ని నాని సొంతం చేసుకున్నారు.
తన నుంచి వచ్చిన గత మూడు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టాయి. దీనితో నాని కూడా ఒకో సినిమా తర్వాత ఇంకో సినిమాకి రెమ్యునరేషన్ ని పెంచుతూ వెళ్ళిపోతున్నాడు. పైగా తన సినిమా అంటే ఓటిటిలు కూడా ముందే డీల్స్ క్లోజ్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. దీనితో నాని ఒక్క దర్శకుల హీరోనే కాకుండా నిర్మాతల హీరోలా కూడా మారిపోయాడు.

ఇక ఇలా ది ప్యారడైజ్ కోసం నాని రికార్డు రెమ్యునరేషన్ అందుకున్నట్టుగా సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. దీనితో ఈ భారీ సినిమా కోసం తాను ఏకంగా 40 కోట్లకి పైగానే పారితోషికం అందుకుంటున్నట్టుగా తెలుస్తుంది. దీనితో ఒక ఐదేళ్ల ముందు వరకు 10 కోట్ల లోపే ఉన్న నాని రేంజ్ ఇపుడు ఏకంగా ఈ రేంజ్ కి చేరడం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చగా మారింది. కాగా నాని మాత్రమే కాకుండా ఈ సినిమా సంగీత దర్శకుడు అనిరుద్ కూడా బీర్ రెమ్యునరేషన్ ని అందుకున్నట్టుగా తెలుస్తుంది.
కాగా లేటెస్ట్ రూమర్స్ ప్రకారం అనిరుద్ కూడా 12 కోట్లకి పైగా అందుకుంటున్నట్టుగా వినిపిస్తుంది. ఇలా ది ప్యారడైజ్ సినిమా మాత్రం చాలా కాస్ట్లీగానే రాబోతుంది అని చెప్పవచ్చు. కాగా ఈ చిత్రంని మేకర్స్ ఏకంగా పాన్ వరల్డ్ లెవెల్లో అనౌన్స్ చేసి ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో కూడా వచ్చే ఏడాది మార్చ్ 26న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు.


Click it and Unblock the Notifications











