రూమర్ల‌పై మరోసారి కస్సుమన్న నాని.. 'ఎవడు చెప్పాడు' అంటూ కౌంటర్

నేచురల్ స్టార్ నాని ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో ఎదో ఒక కొత్త పాయింట్ అయితే ఉంటుంది. ఈ మధ్య పాత్రల విషయంలో నాని మునుపటి కంటే ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. సినిమా సినిమాకు కొంచెం తేడా ఉండేలా చూసుకుంటున్నాడు. ఇక నెక్స్ట్ సినిమాకు సంబంధించిన ఒక రూమర్ వైరల్ అవుతుండగా నాని ఊహించని కౌంటర్ ఇచ్చాడు.

రూమర్స్ కి డైరెక్ట్ కౌంటర్

రూమర్స్ కి డైరెక్ట్ కౌంటర్

నేచురల్ స్టార్ నాని చాలా వరకు రూమర్లపై ఎప్పటికప్పుడు క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటారు. గతంలో కొన్ని రూమర్లకి సోషల్ మీడియా ద్వారానే కౌంటర్ ఇచ్చాడు. ఇక రీసెంట్ గా మరొక రూమర్ పై కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఎవడు చెప్పాడని కౌంటర్ ఇచ్చాడు. తదుపరి ఈ స్టార్ హీరో V సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.

V సినిమా ఓటీటీలో ?

V సినిమా ఓటీటీలో ?

సమ్మర్ మొదట్లోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన V సినిమా కరోనా వైరస్ కారణంగా వాయిదా పడుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని రూమర్స్ కూడా వస్తున్నాయి. కానీ మొదట్లోనే దిల్ రాజు టీమ్ ఆ రూమర్స్ ని కొట్టి పారేసింది. ఇక థియేటర్స్ వచ్చిన తరువాత V సినిమా రిలీజ్ అవుతుందా లేదా అనేది కన్ఫ్యూజన్ గా మారింది.

బైపోలర్ డిజార్డర్..

బైపోలర్ డిజార్డర్..

ఇకపోతే నాని, శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీశ్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాలో నాని బై పోలార్ డిజార్డర్ తో కనిపించే అవకాశం ఉన్నట్లు కథనాలు వచ్చాయి. అంటే సడన్ గా ఎమోషన్స్ చేంజ్ అవ్వడంతో ఎనర్జి లెవెల్స్, మూడ్స్ మారిపోతు ఉండే ఒక మానసిక వ్యాధి గ్రస్తుడిగా కనిపిస్తాడని వార్త రాగా నాని ఊహించని విధంగా స్పందించారు.

Recommended Video

Penguin Trailer | Penguin OTT Worldwide Release on June 19
ఎవడు చెప్పాడు?

ఎవడు చెప్పాడు?

ఎవడు చెప్పాడు. ఇది నిజం కాదు అంటూ సోషల్ మీడియా ద్వారా రూమర్స్ కి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. నాని రెండు పధాల్లోనే కౌంటర్ ఇచ్చిన విధానం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఆ సినిమా తరువాత నాని రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో శ్యామ్ సింగరాయ్ అనే సినిమా చేయనున్నాడు. ఆ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవి నటించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X