బిగ్ బాస్ అయ్యేంతవరకు బయటకు రాకూడదని అనుకున్నా.. నాని!
Recommended Video

నేచురల్ స్టార్ నాని దర్శకులకు, నిర్మాతలకు క్రేజీ హీరో. నానితో సినిమా అంటే మినిమమ్ గ్యారెంటీ నిర్మాతకు ఉంటుంది. వరుస విజయాలతో స్టార్ గా మారిపోయిన నాని ప్రస్తుతం బిగ్ బాస్ 2 లో హోస్ట్ వ్యవహరిస్తున్నాడు. తాజగా నాని గూఢచారి థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు హాజరయ్యాడు. సందరర్భంగా నాని ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

బిగ్ బాస్ అయ్యేంతవరకు
బిగ్ బాస్ అయ్యేంతవరకు బాటకు ఎక్కడకి వెల్ళకూడదు, ఏ ఈవెంట్స్ కు హాజరు కాకూడదు అని అనుకున్నట్లు నాని తెలిపాడు. కానీ గూఢచారి చిత్రం ట్రైలర్ లాంచ్ చేయాలని నన్ను పిలిచినా వెంటనే ఒప్పేసుకున్నా అని నాని తెలిపాడు. అంతలా ఈ చిత్రం తనని ఆకర్షించినట్లు నాని తెలిపాడు.

చివరగా అర్జున్ రెడ్డి
తాను చివరగా ట్రైలర్ లాంచ్ చేసిన చిత్రం అర్జున్ రెడ్డి అని నాని తెలిపాడు. ఆ చిత్రం అద్భుత విజయం సాధించింది. ఇప్పుడు గూఢచారి ట్రైలర్ లాంచ్ చేశా. ట్రైలర్ చూసిన వెంటనే ఈ చిత్రం కూడా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం కలిగిందని నాని తెలిపాడు.

అలాంటి సినిమా పడలేదు
అడవి శేష్ అద్భుతమైన నటుడు. తాను నటించిన క్షణం లాంటి చిత్రాల్లో అద్భుతమైన పెర్ఫామెన్స్ ఇచ్చాడు. కానీ అడవిశేష్ పెర్ఫామెన్స్ కు తగ్గ సినిమా ఇంతవరకు పడలేదని అనుకునేవాడిని. ఈ చిత్రం ఆ లోటు తీరుస్తుందని భావిస్తున్నట్లు నాని తెలిపాడు.
యాక్షన్ థ్రిల్లర్
యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ చిత్రం రాబోతోంది. అడవిశేష్ ప్రధాన పాత్రలో నటించాడు. శశి కిరణ్ ఈ చిత్రానికి దర్శకుడు. నాని లాంచ్ చేసిన ట్రైలర్ కట్టిపడేసే విధంగా ఉంది.


Click it and Unblock the Notifications











