మరో స్పోర్ట్స్ డ్రామాతో రాబోతున్న నాని: ఈ సారి ఆ గేమ్ ప్లేయర్‌గా చేస్తున్నాడట
ఏమాత్రం బ్యాగ్రౌండ్ లేకపోయినా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు టాలెంటెడ్ హీరో నాని. క్లాప్ అసిస్టెంట్ స్థాయి నుంచి స్టార్ హీరోగా ఎదిగాడతను. సుదీర్ఘమైన ప్రయాణంలో ఎన్నో చిత్రాల్లో సహజ సిద్ధమైన నటనను కనబరిచిన ఈ యంగ్ హీరో.. వాటన్నింటినీ వన్ మ్యాన్ షోలుగా మార్చేశాడు. ఇదే ఉత్సాహంతో మరిన్ని చిత్రాలు చేసుకుంటూ దూసుకెళ్తోన్నాడు. ప్రస్తుతం ఏకంగా మూడు సినిమాలు చేతిలో ఉన్నా.. తాజాగా మరో ప్రాజెక్టుకు నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. ఈ సారి మరో స్పోర్ట్స్ డ్రామాతో రాబోతున్నాడని కూడా ఓ న్యూస్ ఫిలిం నగర్‌లో వైరల్ అవుతోంది.
తాజా సమాచారం ప్రకారం.. నేచురల్ స్టార్ నాని.. తాజాగా ఓ కొత్త దర్శకుడితో కథా చర్చలు జరిపాడట. ఫుట్‌బాల్ గేమ్ నేపథ్యంతో సాగే ఈ స్క్రిప్ట్ అతడికి బాగా నచ్చిందని తెలుస్తోంది. దీంతో సదరు డైరెక్టర్‌కు వెంటనే పచ్చజెండా ఊపేశాడని తెలిసింది. ఇక, ఇందులో నాని ఫుల్‌బాట్ ఆటగాడిగా నటిస్తున్నాడని సమచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారనే టాక్ వినిపిస్తోంది. గతంలో నాని 'భీమిలి కబడ్డీ జట్టు' మూవీలో కబడ్డీ ఆటగాడిగా.. 'జెర్సీ'లో క్రికెట్ ప్లేయర్‌గా నటించాడు. ఈ రెండూ సూపర్ హిట్ అయ్యాయి.

ఇదిలా ఉండగా.. నాని చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి 'టక్ జగదీష్'. శివ నిర్వాణ రూపొందించిన ఈ సినిమా కరోనా కారణంగా విడుదల వాయిదా పడిపోయింది. మరోవైపు.. 'మెంటల్ మదిలో', 'బ్రోచేవారెవరురా' వంటి ఆసక్తికరమైన సినిమాలను తెరకెక్కించిన వివేక్ ఆత్రేయతో 'అంటే.. సుందరానికీ' అనే సినిమా చేస్తున్నాడు నాని. అలాగే, 'టాక్సీవాలా' దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ తెరకెక్కిస్తోన్న 'శ్యామ్ సింగా రాయ్'లోనూ నటిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











