twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వరుస అప్డేట్లతో నాని రెడి.. ఇక రచ్చ మామూలుగా ఉండదు!

    |

    ప్రస్తుతం నాని ఉన్న జోరు చూస్తుంటే ఎవ్వరైనా సరే షాక్ అవ్వాల్సిందే. వరుస ప్రాజెక్ట్‌లతో నాని దూసుకుపోతోన్నాడు. ఇప్పుడు నాని టక్ జగదీష్ మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఇది పూర్తైన వెంటనే శ్యాం సింఘరాయ్ అనే ప్రాజెక్ట్‌లో జాయిన్ అవుతాడు. అయితే ఇప్పుడు మాత్రం నాని పూర్తి ఫోకస్ మాత్రం టక్ జగదీశ్ మీదే ఉంది. అందుకే ఈ సినిమాను ప్రమోట్ చేసే పనిలో పడ్డాడు. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లు బాగానే క్లిక్అయ్యాయి.

    ఈ మధ్యే రిలీజ్ చేసిన మొదటి పాట కూడా బాగానే ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే నాని తాజాగా తన అభిమానులకు బ్యాక్ టు బ్యాక్ అప్డేట్లను ఇచ్చి ఖుషీ చేస్తున్నాడు. టక్ జగదీశ్, శ్యాం సింఘరాయ్ సినిమాలకు సంబంధించిన అప్డేట్లు ఇస్తానని చెప్పేశాడు. అయితే ఇందులో టక్ జగదీశ్ నుంచి మోషన్ పోస్టర్ రాబోతోందని, అంతే కాకుండా టీజర్ అప్డేట్ కూడా ఇస్తాడని తెలుస్తోంది.

    Nani Tuck Jagadish And Shyam Singha Roy Updates

    రేపు (ఫిబ్రవరి 20) సాయంత్రం 5 04 గంటలకు మోషన్ పోస్టర్, టీజర్ అప్డేట్ ఇస్తున్నట్టుగా టక్ జగదీశ్ టీం ప్రకటించింది. అంతే కాకుండా శ్యాం సింఘరాయ్ నుంచి కూడా అప్డేట్ రాబోతోందని నాని ప్రకటించేశాడు. శ్యాం సింఘరాయ్ యూనిట్ తమ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నట్టు కనిపిస్తోంది. ఇక నాని ఈ రెండు ప్రాజెక్ట్‌ల తరువాత అంటే సుందరానికీ! అనే చిత్రంతో బిజీగా ఉంటాడు.

    English summary
    Nani Tuck Jagadish And Shyam Singha Roy Updates
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X