Don't Miss!
- News పవన్ అప్పుల చిట్టా రూ. 46,70,00,000: `వదిన` దగ్గర పర్సనల్ లోన్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Sports SRH Playing XI: అతనిపై వేటు..RCBతో తుది జట్టు ఇదే!
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
వరుస అప్డేట్లతో నాని రెడి.. ఇక రచ్చ మామూలుగా ఉండదు!
ప్రస్తుతం నాని ఉన్న జోరు చూస్తుంటే ఎవ్వరైనా సరే షాక్ అవ్వాల్సిందే. వరుస ప్రాజెక్ట్‌లతో నాని దూసుకుపోతోన్నాడు. ఇప్పుడు నాని టక్ జగదీష్ మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఇది పూర్తైన వెంటనే శ్యాం సింఘరాయ్ అనే ప్రాజెక్ట్‌లో జాయిన్ అవుతాడు. అయితే ఇప్పుడు మాత్రం నాని పూర్తి ఫోకస్ మాత్రం టక్ జగదీశ్ మీదే ఉంది. అందుకే ఈ సినిమాను ప్రమోట్ చేసే పనిలో పడ్డాడు. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లు బాగానే క్లిక్అయ్యాయి.
ఈ మధ్యే రిలీజ్ చేసిన మొదటి పాట కూడా బాగానే ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే నాని తాజాగా తన అభిమానులకు బ్యాక్ టు బ్యాక్ అప్డేట్లను ఇచ్చి ఖుషీ చేస్తున్నాడు. టక్ జగదీశ్, శ్యాం సింఘరాయ్ సినిమాలకు సంబంధించిన అప్డేట్లు ఇస్తానని చెప్పేశాడు. అయితే ఇందులో టక్ జగదీశ్ నుంచి మోషన్ పోస్టర్ రాబోతోందని, అంతే కాకుండా టీజర్ అప్డేట్ కూడా ఇస్తాడని తెలుస్తోంది.
రేపు (ఫిబ్రవరి 20) సాయంత్రం 5 04 గంటలకు మోషన్ పోస్టర్, టీజర్ అప్డేట్ ఇస్తున్నట్టుగా టక్ జగదీశ్ టీం ప్రకటించింది. అంతే కాకుండా శ్యాం సింఘరాయ్ నుంచి కూడా అప్డేట్ రాబోతోందని నాని ప్రకటించేశాడు. శ్యాం సింఘరాయ్ యూనిట్ తమ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నట్టు కనిపిస్తోంది. ఇక నాని ఈ రెండు ప్రాజెక్ట్‌ల తరువాత అంటే సుందరానికీ! అనే చిత్రంతో బిజీగా ఉంటాడు.