'భలే భలే మగాడివోయ్' కంటే హై డోస్.. నాని గోల మామూలుగా ఉండదట!
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో భలే భలే మగాడివోయ్ సినిమా ఎలాంటి విజయాన్ని అందించిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అప్పటివరకు బాక్సాఫీస్ హిట్టుకోసం ఎంతగానో ప్రయత్నం చేస్తున్న నానికి ఆ సినిమా ఒక్కసారిగా కమర్షియల్ గానే కాకుండా నటుడిగా కూడా మంచి గుర్తింపు తెచ్చింది. న్యాచురల్ స్టార్ నాని బ్రాండ్ ఇమేజ్ ని అమాంతంగా పెంచేసిన ఆ సినిమా ఎన్ని సార్లు చూసిన బోర్ కొట్టదు.
నాని అసలైన కామెడీ టైమింగ్ ని కూడా ఆ సినిమా బయటపెట్టింది. అయితే ఆ సినిమా స్థాయిలో ఇంతవరకు నాని నవ్వించింది లేదు. మధ్యలో లవ్ స్టోరీలు, మాస్ స్టోరీలు అంటూ బిజీగా కొత్త సక్సెస్ లు అందుకున్న నాని తన నుంచి అందించాల్సిన కామెడీ ఎంటర్టైన్మెంట్ ని అందించలేదు. అయితే నెక్స్ట్ భలే భలే మగాడివోయ్.. కంటే హై రేంజ్ లో కామెడీని అందించాలని ఫిక్స్ అయ్యాడట. ఇటీవల దర్శకుడు వివేక్ ఆత్రేయ చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

బ్రోచేవారెవరురా అనే సినిమాతో ఓ వర్గం ఆడియెన్స్ ని అమితంగా ఎట్రాక్ట్ చేసిన దర్శకుడు వివేక్ నెక్స్ట్ సినిమాను నానితో చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయట. ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోయే ఆ సినిమాలో నాని రెండు విభిన్నమైన పాత్రలతో అలరించనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే నాని V సినిమా విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే. లాక్ డౌన్ అనంతరం ఆ సినిమా రిలీజ్ పై క్లారిటీ రానుంది.


Click it and Unblock the Notifications











