Don't Miss!
- News బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి
- Sports SRHకు భయపడి CSK సంచలన నిర్ణయం: ధోనీ మైండ్ గేమ్?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Lifestyle హడలెత్తిస్తున్న Bird Flu పాలు,గుడ్లు మరియు చికెన్ తినడం సురక్షితమేనా?మనుషులకూ వ్యాపిస్తుందా..నిపుణులు ఏమంటారు?
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నాని అస్సలు తగ్గట్లేదుగా.. మొదటిసారి అలాంటి ఊరమాస్ స్టైల్ లో..
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో తన పాత్రతోనే మంచి ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేస్తుంటాడు. కథ ఎంత రొటీన్ గా ఉన్నా కూడా వీలైనంత వరకు నటనతోనే ప్రేక్షకులను థియేటర్స్ వరకు తీసుకొస్తుంటాడు. ఇక నాని కెరీర్ లో కమర్షియల్ రొటీన్ సినిమాలు తప్పితే పెద్దగా ప్రయోగాలు లేవనే కామెంట్స్ చాలానే వచ్చాయి.
ఇక నాని ఆ కామెంట్స్ కు కౌంటర్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నట్లు అతని లైనప్ చూస్తేనే అర్ధమవుతోంది. టక్ జగదీష్ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇక రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో చేస్తున్న శ్యామ్ సింగరాయ్ పిరియాడిక్ డ్రామాగా రూపొందుతోంది. అంటే.. సుందరానికి.. సినిమా కూడా డిఫరెంట్ కామెడీ ఎంటర్టైనర్ గా రానుంది.
ఈ సినిమాలన్నీ ఒకలా ఉంటే శ్రీకాంత్ అనే ఒక కొత్త దర్శకుడితో మొదలు పెట్టనున్న సినిమా మరొకాలా ఉంటుందట. మొదటిసారి పూర్తి స్థాయిలో తెలంగాణ యాసలో మాట్లాడే ఒక ఊర మాస్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఎలాగైనా ఈ విభిన్నమైన సినిమాలతో వరుసగ బాక్సాఫీస్ హిట్స్ అందుకోవాలని అనుకుంటున్నాడు.
చివరగా నాని V సినిమాతో భారీ డిజాస్టర్ అందుకున్న విషయం తెలిసిందే. అందుకే ఈసారి విభిన్నమైన లైనప్ తో ప్రేక్షకులను సరికొత్తగా ఆకట్టుకోవలనే ఆలోచనతో వెళుతున్నాడు. మరి రాబోయే ఈ నాలుగు సినిమాలతో నేచురల్ స్టార్ తన మార్కెట్ ను ఏ స్థాయిలో పెంచుకుంటాడో చూడాలి.