Just In
- 5 hrs ago
బండ్ల గణేష్‌కు తీవ్ర అస్వస్థత.. ఐసీయూలో చేరిన స్టార్ ప్రొడ్యూసర్
- 6 hrs ago
Vakeel Saab Day 5 collections.. చరిత్ర సృష్టించిన పవన్ కల్యాణ్.. లాక్డౌన్ తర్వాత అరుదైన రికార్డు
- 6 hrs ago
ఏక్ లవ్ యా అంటూ నిర్మాతగా మారిన పూరీ జగన్నాథ్ హీరోయిన్.. సొంత తమ్ముడే హీరోగా
- 6 hrs ago
ఐదు భాషల్లో ఆర్జీవి ‘దెయ్యం’.. ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకు.. రిలీజ్ ఎందుకు లేట్ అయిందంటే..
Don't Miss!
- News
గూర్ఖాలూ ఆందోళన వద్దు! మీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం: అమిత్ షా
- Sports
KKR vs MI:గెలిచే మ్యాచ్‌లో ఓడిన కోల్‌కతా.. ముంబై ఇండియన్స్ బోణీ!
- Finance
సెన్సెక్స్ 660 పాయింట్లు జంప్, మార్కెట్ అదరగొట్టడం వెనుక...
- Automobiles
డ్యూయెల్ ఛానెల్ ఏబిఎస్‌తో రానున్న యమహా ఎమ్‌టి-15 బైక్: డీటేల్స్
- Lifestyle
Sun Transit in Aries on 14 April:మేషంలోకి సూర్యుడి సంచారం.. ఈ రాశుల వారికి ప్రత్యేకం...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మరో సర్ ప్రైజ్ ఇవ్వబోతున్న నాని.. సిద్దమవుతున్న స్పెషల్ టీజర్!
నేచురల్ స్టార్ నాని బాక్సాఫీస్ వద్ద హిట్ అందుకొని చాలా కాలమవుతోంది. వైవిధ్యమైన సినిమాలతో ఆకట్టుకుంటున్నప్పటికి గతంలో మాదిరిగా అనుకున్నంత స్థాయిలో కలెక్షన్స్ రావడం లేదు. ఇక నెక్స్ట్ శ్యామ్ సింగరాయ్ సినిమా కోసం నిర్మాతలు బడ్జెట్ విషయంలో ఏ మాత్రం వెనుకాడడం లేదు. టాక్సివాలా దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ తో శ్యామ్ సింగరాయ్ సినిమాను కొన్ని నెలల క్రితం మొదలు పెట్టిన విషయం తెలిసిందే.
పిరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాకు బడ్జెట్ చాలానే ఖర్చయ్యే అవకాశం ఉందట. సినిమాలో కాళి మాత టెంపుల్ హైలెట్ కానుందట. ఆ గుడి కోసమే భారీగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా సినిమా కోసం 60కోట్ల వరకు ఖర్చయ్యే ఛాన్స్ ఉందట. నాని కెరీర్ లో ఇంతవరకు ఈ స్థాయిలో ఖర్చు చేయలేదు. దర్శకుడు చెప్పిన కథ అభిమానుల అంచనాలకు తగ్గట్లుగానే ఉంటుందట.

అందుకే నిర్మాతలు ఏ మాత్రం కాంప్రమైజ్ కావడం లేదు. ఇక సినిమాలో సాయి పల్లవితో పాటు ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్స్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. సినిమాకు సంబంధించిన టీజర్ ను కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే స్పెషల్ అప్డేట్ ఇవ్వబోతున్నారని టాక్. ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఉగాది సందర్భంగా ఏప్రిల్ విడుదల చేయనున్నట్లు సమాచారం. మరి టీజర్ తో నాని ఏ రేంజ్ లో బజ్ క్రియేట్ చేస్తాడో చూడాలి.