నాని బాక్సాఫీస్ టార్గెట్.. యువ దర్శకులతో వరుసగా 4 సినిమాలు

నేచురల్ స్టార్ నాని ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో ఎదో ఒక డిఫరెంట్ పాయింట్ అమితంగా ఆకట్టుకుంటుంది. నాని నుంచి ఆడియెన్స్ ఎక్కువగా కోరుకునేది ఎంటర్టైన్మెంట్ అండ్ ఎమోషనల్ సినిమాలే. ఇప్పటివరకు చేసిన సినిమాల్లో నానికి ఎక్కువగా వర్కౌట్ అయ్యింది కూడా అలాంటి సినిమాలే. అంతే కాకుండా నాని కాస్త డిఫరెంట్ గా ట్రై చేస్తే బావుంటుందనే కామెంట్స్ కూడా ఎక్కువవుతున్నాయు. ఇక ఇటీవల V సినిమాతో కాస్త డిఫరెంట్ గా ఆకట్టుకోవాలని చూసిన నాని చివరికి విమర్శలే అందుకున్నాడు.

అసలు మ్యాటర్ లోకి వస్తే నాని నెక్స్ట్ వరుసగా నాలుగు సినిమాలను లైన్ లో పెట్టాడు. తప్పకుండా ఆ సినిమాలు మంచి సక్సెస్ అవుతాయని అతను సెలెక్ట్ చేసుకున్న దర్శకులను చూస్తుంటే అర్ధమవుతోంది. ముందుగా నాని శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీష్ అనే సినిమాను పూర్తి చేయనున్నాడు. నిన్ను కోరి వంటి హిట్ తరువాత వీరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.

 Nani upcoming movies with four different scripts

ఇక ఆ తరువాత లైనప్ కూడా గట్టిగానే ఉంది. టాక్సివాలా దర్శకుడు రాహుల్ తో ఒక పిరియాడిక్ కాన్సెప్ట్ లో డిఫరెంట్ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ సినిమాకు శ్యామ్ సింగరాయ్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. ఈ ప్రాజెక్టు అనంతరం బ్రిచేవారెవరురా దర్శకుడు వివేక్ ఆత్రేయతో ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ కథను చేయబోతున్నాడు.

ఆ సినిమాతో పాటు ఒకేసారి 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ'తో మంచి సక్సెస్ అందుకున్న స్వరూప్ తో కూడా కొత్త సినిమాను స్టార్ట్ చేయనున్నట్లు సమాచారం. ఈ విదంగా నాని టాలెంటేడ్ యువ దర్శకులతో సెట్ చేసుకున్న డిఫరెంట్ కథలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటాయని టాక్ వస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X