శ్యాం సింగరాయ్ షూటింగ్ పూర్తి చేసిన నాని: అది మొదలవుతుందంటూ ప్రకటన

ఏమాత్రం బ్యాగ్రౌండ్ లేకపోయినా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. సహజ సిద్ధమైన నటనతో చాలా తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు నేచురల్ స్టార్ నాని. కెరీర్ ఆరంభం నుంచీ హిట్లు ఫ్లాపులను పట్టించుకోకుండా సినిమాలు చేస్తున్న అతడు.. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ స్వింగ్‌లో కనిపిస్తున్నాడు. ఇప్పటికే 'టక్ జగదీష్' అనే మూవీని పూర్తి చేసిన అతడు.. అది పట్టాలపై ఉన్న సమయంలోనే 'శ్యామ్ సింగ రాయ్', 'అంటే.. సుందరానికీ' అనే సినిమాలను లైన్‌లో పెట్టేశాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా నాని కొత్త సినిమాకు సంబంధించిన ఓ అదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది.

'ట్యాక్సీవాలా'తో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్న రాహుల్ సంకృత్యన్ డైరెక్షన్‌లో నేచురల్ స్టార్ నాని నటిస్తోన్న చిత్రమే 'శ్యామ్ సింగ రాయ్'. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. చాలా రోజుల క్రితమే మొదలైన ఈ సినిమా షూటింగ్.. తాజాగా నేడు ముగిసింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. అంతేకాదు, నాని సైతం ట్విట్టర్ ద్వారా ఈ న్యూస్ చెప్పాడు. అలాగే, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభం అవుతున్నాయని కూడా వెల్లడించాడు. దీనిపై అతడి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.

Nanis Shyam Singha Roy Shooting Wrapped

పూర్తి స్థాయి వైవిధ్యమైన కథతో రాబోతున్న 'శ్యామ్ సింగ రాయ్' నుంచి ఇప్పటి వరకూ విడుదలైన అన్ని పోస్టర్లకు భారీ రెస్పాన్స్ వచ్చింది. మరీ ముఖ్యంగా ఇందులో నాని కోరమీసంతో కనిపించిన తీరు ఆకట్టుకుంది. ఇక, ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వెంకట్ బోయినపల్లి దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఇక, ఈ మూవీ ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X