ఇంతవరకు కనిపించని విధంగా.. షాకింగ్ లుక్‌లో నారా రోహిత్
సెలెబ్రిటీలందరూ ఈ లాక్‌డౌన్‌ను బాగానే వాడుకుంటున్నారు. కొత్తగా సోషల్ మీడయాలోకి ఎంట్రీ ఇచ్చేవారు ఇస్తున్నారు. ఆల్రెడీ ఉన్నవాళ్లు ఓ రేంజ్‌లో సోషల్ మీడియాను ఆడేసుకుంటున్నారు. కొత్తగా వచ్చిన వారు కూడా బాగానే వాడుకుంటున్నారు. ఈ క్రమంలో నారా రోహిత్ గురించిచెప్పుకోవాలి. లాక్ డౌన్ కాలంలో.. ఖాళీగా ఉండే బదులు సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుందని ఆలోచించినట్టు కనిపిస్తోంది.
నారా రోహిత్ వెండితెరపై తప్పా.. మిగతా ఎక్కడా కూడా ఎక్కువగా కనిపించడు. ఎక్కడా కూడా హడావిడి చేసినట్టు దాఖాలాలు లేవు. ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా.. అణిగిమణిగి ఉంటాడు. విభిన్న చిత్రాలు మాత్రమే చేస్తాడని, మంచి నటుడని పేరు తెచ్చుకున్న నారా రోహిత్.. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాను తెగ వాడేస్తున్నాడు. ఇన్నాళ్లుగా సోషల్ మీడియాకు దూరంగా ఉన్న నారా రోహిత్.. ఈ మధ్యే ఎంట్రీ ఇచ్చాడు. తన మొదటి చిత్రం బాణంలోని ఓ స్టిల్‌ను పోస్ట్ చేశాడు.

సినీ రంగానికి, రాజకీయ రంగానికి సంబంధించిన తన అభిప్రాయాలను షేర్ చేస్తూ హల్చల్ చేస్తున్నాడు. ఈ మధ్య నిఖిల్ వివాహాం, రామ్ బర్త్ డేకు సంబంధించిన ట్వీట్స్ చేశాడు. రీసెంట్‌గా ఆయన షేర్ చేసిన ఓ పిక్ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఒకప్పుడు చాలా లావుగా ఉన్నాడని, గ్లామర్ పోయిందని కామెంట్ చేసిన వారి కళ్లు తిరిగిపోయేలా ఓ స్టైలీష్ లుక్‌ను రిలీజ్ చేశాడు. క్లీన్ షేవ్‌లో ఉన్న నారా రోహిత్ బాలీవుడ్ హీరోలా ఉన్నాడు. ఇక పిక్ క్షణాల్లో వైరల్ అయింది. నారా రోహిత్ చేతిలో ప్రస్తుతం ఏ ప్రాజెక్ట్ కూడా ఉన్నట్టు కనిపించడం లేదు.


Click it and Unblock the Notifications











