క్రేజీ మల్టీస్టారర్ విడుదల తేదీ ఖరారు!
క్రేజీ మల్టీస్టారర్ చిత్రంగా రూపొందుతున్న వీర భోగ వసంత రాయులు చిత్ర విడుదల తేదీ ఖరారైంది. సుధీర్ బాబు, నారా రోహిత్, శ్రీ విష్ణు, శ్రీయ ప్రధాన పాత్రల్లో నటిస్తుంది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 26న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించడం విశేషం.
ఇంద్రసేన దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. విభిన్నమైన కాన్సెప్ట్ తో రూపొందుతున్న ఈ చిత్రంపై మంచి ఆసక్తి నెలకొని ఉంది. క్రైమ్ కి సంబందించిన అంశాలు ఈ చిత్రంలో ఉత్కంఠ రేకెత్తించే విధంగా ఉంటాయట. శ్రీవిష్ణు, నారా రోహిత్, సుధీర్ బాబు ఈ చిత్రంలో డిఫెరెంట్ లుక్ లో కనిపించబోతున్నారు.

టాలీవుడ్ లో మల్టీస్టారర్ చిత్రాల జోరు పెరుగుతోంది. చిన్న చిత్రాలలో క్రేజీ మల్టీస్టారర్ గా వస్తున్న ఈ చిత్రం ఏస్థాయిలో మ్యాజిక్ చేస్తుందో చూడాలి. సుధీర్ బాబు సోలో హీరోగా నటిస్తూనే ఇలా మల్టీస్టారర్ చిత్రాల్లో కూడా మెరుస్తున్నాడు.
sudheer babu veera bhoga vasantha rayalu nara rohit sri vishnu shriya saran సుధీర్ బాబు వీరభోగ వసంత రాయులు శ్రీయ శరన్


Click it and Unblock the Notifications