అదిరిపోయే లుక్.. దుమ్ములేపుతున్న నాటకం హీరో
నాటకం సినిమాతో హీరోయిన్ అశిమా నర్వాల్, హీరో అశీష్ గాంధీ ఎంతగా ఫేమస్ అయ్యారో అందరికీ తెలిసిందే. బోల్డ్‌గా కనిపించడమే కాదు.. అంతకుమించి అనేలా నటించి అందరినీ ఆకట్టుకున్నారు. అయితే అలా బోల్డ్ చిత్రాల్లో నటించడంతో సోషల్ మీడియాలో ఈ ఇద్దరికి మంచి పాపులారిటీ వచ్చింది. అయితే ఆశీమా నర్వాల్, ఆశీష్ గాంధీ ఇద్దరి కెరీర్ కూడా కాస్త నెమ్మదిగానే సాగుతోన్నట్టు కనిపిస్తోంది. ఈ మధ్యే అశీమా నటించిన ఓ వెబ్ సిరీస్ వచ్చింది.
ఇక అశీష్ గాంధీ తన కొత్త సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇచ్చాడు. అదిరిపోయే లుక్కులో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. విజన్ సినిమాస్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 3 గా తెరకెక్కుతున్న ఈ సినిమాని ప్రముఖ వ్యాపారవేత్త నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్నారు. తిరుమల రెడ్డి సహా నిర్మాతగా ఉండగా, మణికాంత్ కూర్పుని అందిస్తున్నారు. బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. నాటకం ఫేమ్ కళ్యాణ్ జి గోగణ దర్శకత్వంలో ఈ మూవీ రాబోతోంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ రెండో వారంలో భారీ తారాగణంతో షూటింగ్‌కి వెళ్లబోతుందట... మొత్తంగా ఈ సినిమా లో మూడు డిఫరెంట్ పాత్రలు పోషిస్తుండగా తాజాగా పోలీస్ పాత్రకు సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది.

ఈ సందర్భంగా నిర్మాత నాగం తిరుపతి రెడ్డి మాట్లాడుతూ.. విజన్ సినిమాస్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 3 గా ఈ సినిమా తెరకెక్కుతుంది. దర్శకుడు చెప్పిన కథ చాలా బాగుంది. ఈ కథకి హీరోగా అశిష్ గాంధీ మాత్రమే సూట్ అవుతాడనిపించింది. ఇటీవలే జరిపిన ఫోటోషూట్ లో మూడు డిఫరెంట్ పాత్రలకు అశీష్ గాంధీ చాల బాగా సూట్ అయ్యాడు. మా బ్యానర్ నుండి రాబోతున్న ఈ సినిమా అందరికి మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. ఏప్రిల్ రెండో వారంలో షూటింగ్ వెళ్ళబోతున్నాం. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని అన్నాడు.


Click it and Unblock the Notifications











