Don't Miss!
- News నెల్లూరు జైలుకు జగన్ పై దాడి కేసు నిందితుడు సతీష్-14 రోజుల రిమాండ్..!
- Sports PBKS vs MI: అందుకే రెండు మార్పులు చేశాం: సామ్ కరణ్
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
అప్పుడే 50వ సినిమాకి దర్శకుడిని ఫిక్స్ చేసుకున్న నాని..!
అష్టాచమ్మా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన న్యాచురల్ స్టార్ నాని కెరీర్ మొదట్లో వరుస విజయాలు అందుకొని ఆ తరువాత ఊహించని విధంగా డీలా పడ్డ విషయం తెలిసిందే. ఇక ఆ సమయంలో భలే భలే మగాడివోయ్ సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద సాలీడ్ హిట్ అందుకున్న నాని చూస్తుండగానే స్టార్ హీరోల రేంజ్ కి ఎదిగిపోయాడు. సినిమా సినిమాకు రెమ్యునరేషన్ డోస్ కూడా పెంచుతున్నాడు.
ప్రస్తుతం నాని చేస్తున్న సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మినిమామ్ కలెక్షన్స్ రాబడుతున్నాయి. ఇకపోతే నెక్ట్ ఈ స్టార్ V అనే డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. అయితే నేడు ఆ సినిమా డైరెక్టర్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి పుట్టినరోజు కావడంతో నాని తనదైన శైలిలో విషెస్ అందించాడు. మోహన్ సర్.. నా 50వ సినిమా మిరే చేయాలి.. మీ 25వ సినిమా నేనే చేయాలి అంటూ.. మోహన్ కృష్ణకి నాని ట్విట్టర్ ద్వారా బర్త్ డే విషెస్ ని అందించారు.
ఇక నాని కెరీర్ లో V సినిమా 25వ సినిమా కావడంతో ఓ వర్గం ఆడియెన్స్ లో స్పెషల్ ఎట్రాక్షన్ నెలకొంది. పైగా అందులో నెగిటివ్ షేడ్స్ ఉన్నట్లు ట్రైలర్ తోనే చెప్పేశారు. అలాగే డైరెక్టర్ మోహన్ కృష్ణతో నాని అష్టాచమ్మాతో పాటు జెంటిమ్ మెన్ అనే సినిమాలు చేశాడు. ఆ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి లబాల్ని అందించాయి. మరి మూడవసారి V సినిమాతో ఎంతవరకు సక్సెస్ అంసుకుంటారో చూడాలి.