బిగ్‌బాస్ షోపై హీరో నాని ఘాటు వ్యాఖ్యలు.. లైఫ్‌లో దాని జోలికి వెళ్లను .. ఛాప్టర్ క్లోజే ..

దేశంలో ఎన్ని రియాలిటీ షోలు ఉన్నా బిగ్‌బాస్ క్రేజే వేరు. విభిన్న వ్యక్తిత్వాలు, మనస్తత్వం ఉన్న వారిని వారి కుటుంబాలకు దూరంగా దాదాపు 100 రోజులకు పైగా ఉంచి గేమ్స్, టాస్క్‌లతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచడమే బిగ్‌బాస్ కాన్సెప్ట్. ఇండియాలో హిందీలో ప్రారంభమైన ఈ మెగా రియాలిటీ షో ప్రస్తుతం దేశంలోని అన్ని ప్రాంతీయ భాషలకు విస్తరించి మంచి క్రేజ్ దక్కించుకుంది. కొత్తగా ఏదొచ్చినా వెర్రెక్కిపోయే తెలుగువారికి బిగ్‌బాస్ షో ఫేవరేట్‌గా మారిపోయింది.

బిగ్‌బాస్‌ తెలుగులో ఇప్పటి వరకు 8 సీజన్లు పూర్తయ్యాయి. గతేడాది జరిగిన బిగ్‌బాస్ తెలుగు 8వ సీజన్‌లో గౌతమ్ కృష్ణ - నిఖిల్ మలియాక్కల్ తలపడగా .. కన్నడ నటుడు నిఖిల్‌ విజేతగా నిలిచాడు. గత సీజన్ ముగిసిందో లేదో అప్పుడే బిగ్‌బాస్ తెలుగు 8 గురించి ప్రేక్షకులల్లో చర్చ మొదలైంది. ఈసారి కంటెస్టెంట్స్ ఎవరు? ఈసారి సీజన్ ఎప్పుడు ప్రారంభం కానుంది? అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఎప్పుడు బిగ్‌బాస్ సీజన్ ప్రారంభమవుతున్నా ఖచ్చితంగా హోస్ట్ గురించి చర్చించుకోవడం ఆనవాయితీగా మారిపోయింది.

natural star nani as bigg boss telugu 9 Host Hit 3 Actor said he would never touch that show in his life

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 1ని ఎన్టీఆర్, సీజన్ 2‌ని నాని హోస్ట్ చేయగా.. మిగిలిన ఆరు సీజన్‌లకు కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించారు. నాగార్జున అంటే బిగ్‌బాస్.. బిగ్‌బాస్ అంటే నాగార్జున అన్నంతగా ఆయన ముద్ర వేశారు. హోస్ట్‌గా ఆయన తప్పించి మరొకరిని ప్రేక్షకులు ఊహించలేరు కూడా. ప్రతిసారి సీజన్ ప్రారంభానికి ముందు నాగార్జున హోస్టింగ్ నుంచి తప్పుకున్నట్లుగా గాసిప్స్ వైరల్ అయ్యేవి. కానీ నేను మీ నాగార్జున అంటూ బిగ్‌బాస్ స్టేజ్ మీద ఎంట్రీ ఇచ్చి విజిల్స్ వేయిస్తారు కింగ్.

మరికొద్దిరోజుల్లో బిగ్‌బాస్ తెలుగు 9 ప్రారంభం కానుంది. గతేడాదికి మించి ఈసారి సీజన్ ఉండేలా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పేరున్న నటీనటులు, వివాదాస్పద వ్యక్తులను కంటెస్టెంట్స్‌గా తీసుకురావాలని బిగ్‌బాస్ టీం వేట మొదలెట్టింది. ఈ ఏడాది నాగార్జున హోస్ట్‌గా ఉండరని ఆయనకు బదులుగా పలువురు స్టార్స్ పేర్లు వినిపిస్తున్నాయి. అన్‌స్టాపబుల్‌తో హోస్ట్‌గా సత్తా చాటిన గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, రౌడీ హీరో విజయ్ దేవరకొండల పేర్లు వినిపిస్తున్నాయి. వీరిద్దరే కాదు.. నేచురల్ స్టార్ నాని పేరు కూడా హోస్ట్ రేసులో వినిపిస్తోంది. సీజన్‌ 2ని అద్భుతంగా హోస్ట్ చేసి బుల్లితెర మీద సక్సెస్ కొట్టారు నాని. ఆయన మరోసారి హోస్ట్‌గా వస్తే చూడాలని ఉందని అభిమానులు కూడా కోరుతున్నారు.

అయితే.. బిగ్‌బాస్ షోపై సంచలన వ్యాఖ్యలు చేశారు నాని. శైలేష్ కొలను దర్శకత్వంలో ఆయన నటిస్తున్న హిట్ 3 చిత్రం కార్మికుల దినోత్సవం కానుకగా మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి ఇందులో హీరోయిన్. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో నాని చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నానిని బిగ్‌బాస్ షో గురించి అడిగారు యాంకర్.

దీనికి ఆయన బదులిస్తూ .. బిగ్‌బాస్ చాప్టర్ ముగిసిపోయిందని, మళ్లీ జీవితంలో దాని జోలికి వెళ్లనని నాని స్పష్టం చేశారు. బయటి ప్రపంచం ఎలా ఉంటుందో బిగ్‌బాస్ షో తనకు చూపించి, మరింత కఠినంగా మార్చేసిందని తెలిపారు. ఆ గేమ్ షో వెనుక చాలా ఎమోషన్స్ ఉంటాయా అనిపించిందని, షో జరుగుతున్నంతసేపు ఒకలా.. షో ముగిసిన తర్వాత మరోలా అభిప్రాయాలు మారిపోతాయని నాని వ్యాఖ్యానించారు. మొత్తానికి బిగ్‌బాస్ వంక కన్నెత్తి కూడా చూడనని ఈ హీరో కుండబద్ధలు కొట్టేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X