కలెక్షన్లు రాకపోయినా సెలబ్రేషన్సా?.. మూడు రోజులకే బ్లాక్ బస్టరా? అందుకే వేడుక అంటూ నాని ఎమోషనల్

అంటే సుందరానికి సినిమా సక్సెస్ మీట్‌లో హీరో నాని ఎమోషనల్ అయ్యారు. సినిమాకు వస్తున్న ఫీడ్‌బ్యాక్ చూసి మేమంత చాలా సంతోషంగా ఉన్నాం. ఒక మంచి సినిమాను ప్రేక్షకుల ముందు ఉంచినందుకు మేము గర్వపడుతున్నాం. వివేక్ ఆత్రేయ రైటింగ్ ఈ సినిమాకు పాజిటివ్ అంటూ నాని అన్నారు. అంటే సుందరానికి సక్సెస్ మీట్‌లో నాని మాట్లాడుతూ..

 వీళ్లేంటి బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్..

వీళ్లేంటి బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్..


అంటే సుందరానికి లాంటి మంచి చిత్రాన్ని అందించిన నా చిత్ర యూనిట్‌కు నా అభినందనలు. ఈ రోజు బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్ అనే ఈవెంట్‌ను జరుపుకొంటున్నాం. సినిమా రిలీజై మూడు రోజులే కదా.. వీళ్లేంటి బ్లాక్ బస్టర్ అంటూ సెలబ్రేట్ చేసుకొంటున్నారని అనుకోవచ్చు. అయితే ఈ సెలబ్రేషన్ బాక్సాఫీస్ నంబర్లను కాకుండా.. సినిమా చూసి మాపై ప్రేక్షకులు కురిపిస్తున్న అభిమానాన్ని, చూసుకొని సెలబ్రేషన్స్ చేసుకొంటున్నాం. బ్లాక్ బస్టర్ అవునా? కాదా? అనేది టైమ్ చెబుతుంది అని నాని అన్నారు.

 క్రిటిక్స్ నా సలహా ఏమిటంటే?

క్రిటిక్స్ నా సలహా ఏమిటంటే?


మంచి సినిమాలు అరుదుగా వస్తుంటాయి. చరిత్రను ఒకసారి తిరిగేస్తే.. రొటీన్ బ్రేక్ చేస్తూ.. కొత్త ఫ్లేవర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి.. నిజాయితీగా కథ చెప్పే సినిమా అప్పుడప్పుడు వస్తుంటాయి. మంచి సినిమాలు వచ్చినప్పుడు మీడియా మిత్రులు నాకు బాగా హెల్ప్ చేశారు. అయితే వారికి, సోషల్ మీడియా హ్యాండిల్స్ మేనేజ్ చేసే వారికి నా చిన్న సలహా. మంచి సినిమా తీసినప్పుడు కలెక్షన్లు లేవని, కమర్షియల్ తీసినప్పుడు మంచి సినిమా తీయలేదనే వాదనను తెస్తుంటారు. మంచి సినిమా తీసినప్పుడు దానిని ముందుకు తీసుకెళ్తే సినిమా పరిశ్రమ అభివృద్ధికి తోడ్పాటు అందించినట్టు అవుతుంది అని నాని తెలిపారు.

 కంటెంట్‌ను నమ్మి సినిమా

కంటెంట్‌ను నమ్మి సినిమా


అంటే సుందరానికి సినిమా సినీ వర్గాలు, మీడియా సెలబ్రేట్ చేసుకోవాలి. ఇతర భాషల్లో మంచి కంటెంట్‌తో సినిమాలు వస్తుంటే వాటికి మంచి ఆదరణ లభిస్తున్నది. కంటెంట్‌ను నమ్మి.. టెక్నికాలిటీని నమ్మి వస్తున్నప్పుడు అందరూ సెలబ్రేట్ చేసుకొంటున్నారు. అలాంటి కోవలోనే అంటే సుందరానికి సినిమా ఉందని నమ్ముతున్నాం. ఇది అందరూ సెలబ్రేట్ చేసుకోవాల్సిన సినిమా అని నాని అన్నారు.

ఆ గట్స్ మాకు ఉన్నాయి అంటూ

ఆ గట్స్ మాకు ఉన్నాయి అంటూ


అంటే సుందరానికి సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి నంబర్లను కలెక్ట్ చేస్తుందనేది టైమ్ చెబుతుంది. ఈ సినిమా గురించి నాకు వస్తున్న ఫోన్లు, మెసేజ్‌లు చూసుకొన్న తర్వాత నా కడుపు నిండిపోతున్నది. నా కెరీర్‌లో గొప్ప సినిమాల్లో ఒకటి అంటే సుందరానికి. ఇలాంటి కథను చెప్పడానికి గట్స్ ఉండాలి. అలాంటి గట్స్ మా దర్శకుడు వివేక్ ఆత్రేయలో, మైత్రీ మూవీస్ బ్యానర్‌కు, మా చిత్ర యూనిట్‌కు ఉన్నాయి అని నాని ఎమోషనల్‌గా మాట్లాడారు.

 అవకాయ లాంటి సినిమా

అవకాయ లాంటి సినిమా


అంటే సుందరానికి సినిమా అవకాయ లాంటింది. ఈ మూడు రోజుల్లో రుచి చూశారు. ఇంకొన్ని రోజుల్లో ఊరి మంచి అనుభూతిని కలిగిస్తుంది. ఇటీవల వచ్చిన మంచి చిత్రాల్లో ఒకటి ఏదని అడిగితే అంటే సుందరానికి అని చెప్పేంతగా ఈ సినిమా ఉందని నమ్ముతున్నాను అని నాని అన్నారు.

 అంటే సుందరం కలెక్షన్లు ఇలా

అంటే సుందరం కలెక్షన్లు ఇలా


అంటే సుందరం సినిమా జూన్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌ను 30 కోట్లుగా అంచనా వేశారు. గత మూడు రోజుల్లో ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 10.40 కోట్ల షేర్, 17.60 కోట్ల గ్రాస్, ప్రపంచవ్యాప్తంగా 14.95 కోట్ల షేర్, 26.25 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. ఇంకా 15 కోట్లు రాబట్టాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X