Don't Miss!
- Finance Telecom News: వినియోగదారులకు టెలికాం కంపెనీల వాత.. ముహూర్తం ఫిక్స్..
- News rasi phalalu today: ఈ రాశులవారు మొదలుపెట్టిన పనులు పూర్తవుతాయి!!
- Sports Mumbai Indians కెప్టెన్సీ మార్పు వెనుక సచిన్.. కొడుకు కోసం రోహిత్‌పై వేటు!
- Lifestyle మీ బాయ్‌ఫ్రెండ్/గర్ల్ఫ్రెండ్లో ఈ మార్పులు ఉంటే మిమ్మల్ని చీట్ చేయడానికి పన్నాగం పడుతున్నారని అర్థం జాగ్రత్త
- Technology గూగుల్ క్రోమ్ భద్రత కోసం సరికొత్త ఫీచర్.. వెబ్సైట్లోకి వెళ్లగానే మాల్వేర్ అటాక్‌లపై అప్రమత్తం చేస్తుంది!
- Automobiles రైలు కదిలేముందు జర్క్ ఎందుకు ఇస్తుంది.??.. ఆసక్తికర విషయాలివే.!!
- Travel హోలీ సందర్భంగా దేశంలోని ఈ ప్రదేశాలను చుట్టేయండి..!
రెమ్యునరేషన్ విషయంలో ఏ మాత్రం తగ్గని నాని.. కరోనా కష్టాల్లో కూడా అన్ని కోట్లా?
టాలీవుడ్ నేచురల్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న నాని మొదటి సినిమా నుంచి చూసుకుంటే కెరీర్ లో ప్రయోగలతో పెద్దగా బాక్సాఫీస్ హిట్ కొట్టలేదు. ఎక్కువగా కామెడీ రొమాంటిక్ లవ్ స్టోరీలతోనే తన మార్కెట్ ని అమితంగా పెంచేసుకున్నాడు. ఇక కరోనా కష్టాల్లో సినిమా ఇండస్ట్రీలు నష్టాల్లో ఉన్నప్పటికీ కొందరి హీరోల రెమ్యునరేషన్ లో పెద్దగా తేడా రాలేదు. అందులో నాని ఒకరు.
మన దగ్గర ఇంకా తగ్గలేదా?
కోలీవుడ్ ఇండస్ట్రీలో చాలా వరకు అగ్ర హీరోల నుంచి మిడియామ్ రేంజ్ హీరోల వరకు వారి రెమ్యునరేషన్ విషయంలో కాస్త తగ్గారనే చెప్పాలి. నిర్మాతల పరిస్థితులను అర్థం చేసుకొని క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా వెనక్కి తగ్గారు. అయితే తెలుగులో మాత్రం ఇంకా అనుకున్నంత రేంజ్ లో అగ్ర తారల పేమెంట్స్ తగ్గలేదని అర్ధమవుతోంది.
ఆ సినిమాలకు కలెక్షన్స్ రాలేకపోయినా..
నాని రెమ్యునరేషన్ అయితే కొన్నిసార్లు రిజల్ట్ తో సంబంధం లేకుండా పెరుగుతోంది. నాని గత సినిమాలు అనుకున్నంత రేంజ్ లో అయితే సక్సెస్ కాలేదు. జెర్సీ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది గాని బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత రేంజ్ లో కలెక్షన్స్ అందుకోలేకపోయింది. ఇక అదే తరహాలో గ్యాంగ్ లీడర్ కూడా మెప్పించలేకపోయింది.
నాని రెమ్యునరేషన్ ఎంతంటే..
ఆ సినిమాల రిజల్ట్ ఒకలా ఉంటే.. మొన్న విడుదలైన V పూర్తిగా నెగిటివ్ కామెంట్స్ ని అందుకుంది. థ్రిల్లర్ మూవీ అంటూ హంగామా చేసినప్పటికీ పెద్దగా వర్కౌట్ కాలేదు. అయినప్పటికీ నాని రీసెంట్ గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలకు దాదాపు రూ.9కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్నాడట. సినిమాల రిజల్ట్ తో సంబందం లేకుండా.. అది కూడా కరోనా కష్ట కాలంలో నాని ఈ రేంజ్ లో పారితోషికాన్ని అందుకుంటున్నాడు అంటే ముందు ముందు ఇంకా ఏ రేంజ్ లో తన డోస్ పెంచుతాడో అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
నెక్స్ట్ ఆ రెండు సినిమాలతో..
ఇక నాని ప్రస్తుతం టక్ జగదీష్ సినిమాను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. నిన్ను కోరి తరువాత శివ నిర్వాణ దర్శకత్వంలో చేస్తున్న ఆ సినిమాపై ఓ వర్గం అభిమానుల్లో అంచనాలు భరిగానే ఉన్నాయి. ఇక ట్యాక్సీవాలా దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో శ్యామ్ సింగరాయ్ అనే మరో సినిమాను చేయనున్న విషయం తెలిసిందే.