Hero Nani: ఒకటా, రెండా.. ఏకకాలంలో ఐదు సినిమాలు.. నాని ఏమాత్రం తగ్గట్లేడుగా!

నాచురల్ స్టార్ నాని.. అద్భుతమైన చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ... పక్కింటి కుర్రాడిలా కనిపిస్తూ తెలుగు అభిమానులకు చాలా దగ్గర అయిపోయాడు. 2008లో అష్టాచమ్మా సినిమాతో సినీ రంగంలో అడుగు పెట్టి నాని.. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. తన అందం, అద్భుతమైన నటనతో గత 15 ఏళ్లుగా సినీ రంగంలో హీరోగా కొనసాగుతున్నాడు. అద్భుతమైన, విభిన్నమైన కథల్లో కనిపిస్తూ.. అందరినీ మెస్మరైజ్ చేసే ఇతను ఇటీవలే దసరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్టు కాగా.. అదే ఊపులో మరో సినిమా చేశాడు. హాయ్ నాన్న అనే చిత్రంతో తండ్రీ, కూతుళ్ల ప్రేమను అందరికీ తెలియజేసేందుకు రాబోతున్నాడు. అయితే ఈ సినిమా ఇంకా విడుదల కూడా కాలేదు. డిసెంబర్ 7వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. అయితే హాయ్ నాన్న సినిమా విడుదల కూడా కాకముందే మరో ఐదు సినిమాలను లైన్ లో పెట్టేశాడు నాని. మరో రెండేళ్ల పాటు ఈ చిత్రాలతోనే ఫుల్ బిజీగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఒక సినిమా అయిపోయాక మరో సినిమా చేస్తుంటారు చాలా మంది. కానీ నాని మాత్రం అన్ని చిత్రాలు ఒకేసారి చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Natural Star Nani Line Up Five Movie in At Time Check Details

ముఖ్యంగా వివేక్ ఆత్రేయతో కలిసి చేయబోతున్న సరిపోలేదా శనివారం సినిమా ఇప్పటికే ప్రారంభం అయింది. అయితే రీజన్ ఏంటో తెలియదు కానీ ఈ సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. అయితే ఇప్పుడు ఈ చిత్రం మరో షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటుంది. ముఖ్యంగా డిసెంబర్ రెండో వారం తర్వాత కంటిన్యూస్ గా ఈ సినిమా షెడ్యూల్స్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇది కాగానే... తమిళ డైరెక్టర్ సిబి చక్రవర్తి ప్రాజెక్టును ప్రారంభిస్తారట. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది రెండో నెలలో లేదా మూడో నెలలో ఈ సినిమా మొదలు పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Natural Star Nani Line Up Five Movie in At Time Check Details

ఇక మూడో చిత్రం హిట్ థర్డ్ కేసు సినిమాలో కూడా నాని కనిపించబోతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే డైరెక్టర్ శైలేష్ కొలను ప్రస్తుతం సైంధవ్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం రిలీజ్ అవ్వగానే హిట్ సినిమా కోసం పని చేస్తారు. అయితే అధికారికంగా ఈ సినిమా గురించి ప్రకటన రాకపోయినప్పటికీ... మరో రెండు మూడు నెలల్లో అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక వీటి తర్వాత దసరా సినిమా దర్శకుడితో నాని మరో సినిమా చేయబోతున్నారట. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో కలిసి రెండోసారి హిట్టు కొట్టాలని నాని భావిస్తున్నట్లు సమాచారం.

Natural Star Nani Line Up Five Movie in At Time Check Details

అయితే ఈ విషయాన్ని డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలనే నేరుగా చెప్పారు. ఇటీవలే తిరుమల దర్శనానికి వెళ్లిన ఈయన నానితో తన నెక్స్ట్ సినిమా గురించి క్లారిటీ ఇచ్చారు. ఇవే కాకుండా మరో రెండు సినిమాల్లో నాని హీరోగా పెట్టుకునేందుకు చర్చలు జరుగుతున్నాయట. కానీ ఆ విషయాలు ఏవీ బయటకు రాలేదు. ప్రస్తుతం ఆల్రెడీ మాట ఇచ్చేసిన చిత్రాలు చేశాకే హీరో నాని వేరే వాళ్లకు మాట ఇచ్చే అవకాశం ఉంది. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X