twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    భారీ రిస్క్ చేస్తున్న నాని.. ఆ నిర్మాత కోసం ఏం చేసినా పర్లేదంటూ !

    |

    డైరెక్షన్ విభాగంలో క్లాప్ అసిస్టెంట్‌గా నట జీవితం మొదలుపెట్టిన నవీన్ కుమార్ గంటా అష్టా చమ్మా సినిమాతో హీరోగా మారాడు. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసుకుంటూ ఇప్పుడు నేచురల్ స్టార్ నానిగా మారాడు. తెలుగులో మినిమమ్ గ్యారంటీ హీరోగా నానికి పేరుంది. అందుకే తనకు తగ్గ కథలు ఎంచుకుంటూ సినిమాలు చేసుకుంటూ వెళ్తాడు ఆయన. గత ఏడాది వీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఆ సినిమా నిరాశపరిచింది.. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో ఆయన రెండు సినిమాలు లైన్ లో పెట్టాడు. అందులో ఒక సినిమాకు సంబంధించిన ఆసక్తికర అంశం వెలుగులోకి రాగా అది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వివరాల్లోకి వెళితే

    ఒక సినిమా వాయిదా

    ఒక సినిమా వాయిదా

    నేచురల్ స్టార్ నాని శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీశ్ అనే సినిమాలో నటించారు. నిజానికి ఈ సినిమా గత నెలలో 23వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా థియేటర్లు మూసివేత గురించి ముందే ఊహించిన సినిమా యూనిట్ సినిమాని వాయిదా వేసింది. మళ్లీ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే విషయం త్వరలో ప్రకటిస్తామని కూడా నాని వాయిదా ప్రకటనలో చెప్పుకొచ్చాడు. ఈ సినిమాతో పాటు ఆయన శ్యామ్ సింగరాయ్ అనే సినిమా కూడా చేస్తున్నారు.

    ఆరున్నర కోట్ల రూపాయల సెట్

    ఆరున్నర కోట్ల రూపాయల సెట్

    పూర్తిగా కలకత్తా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల పాటు పశ్చిమ బెంగాల్ లో జరిపారు. అయితే అక్కడ ఎన్నికల నేపథ్యంలో షూటింగ్కు అంతరాయం కలగడంతో యూనిట్ అంతా తిరిగి వచ్చారు. ఆ తర్వాత ఈ సినిమా షూటింగ్ కొన్నాళ్లపాటు గోదావరి జిల్లాల్లో జరిగింది. గోదావరి నది ఒడ్డున ఈ సినిమా షూటింగ్ జరగగా ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ అంతా హైదరాబాద్లో జరుగుతోంది. ఈ సినిమా కోసమే ప్రత్యేకంగా ఆరున్నర కోట్ల రూపాయలు పెట్టి కలకత్తాలోని కాళీ మాత గుడితో సహా కొన్ని వీధులను స్పురించేలా సెట్ నిర్మించారు. ఈ మధ్య కాలంలోనే ఈ సెట్ లోనే షూటింగ్ కూడా జరుగుతోంది.

     ఫైనాన్షియల్గా భారం కాకూడదని

    ఫైనాన్షియల్గా భారం కాకూడదని

    అయితే కరోనా కేసులు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో దాదాపు అన్ని సినిమాల షూటింగ్ లు ఆపేస్తున్నా నాని మాత్రం ఈ సినిమా నిర్మాత ఇబ్బంది పడకూడదని షూటింగులో పాల్గొంటున్నాడని తెలుస్తోంది. ఏదైతే అది అయ్యింది అనే ఉద్దేశంతో నాని రిస్క్ చేసి మరీ షూటింగుకి హాజరవుతున్నారని చెబుతున్నారు.. దానికి కారణం ఈ సినిమా నిర్మాత మీద, ప్రొడక్షన్ హౌస్ మీద ఫైనాన్షియల్గా భారం పడకూడదనే అని అంటున్నారు. ఎందుకంటే ఈ సినిమా నాని కెరీర్లోనే భారీ బడ్జెట్ సినిమా.

     ప్రభుత్వం నిబంధనల మేరకు

    ప్రభుత్వం నిబంధనల మేరకు

    దాదాపు వారం రోజుల షూటింగ్ పెండింగ్ ఉండగా ఆ షూటింగ్ కూడా ఇప్పుడు నిరాటంకంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం విధించిన నిబంధనల మేరకు షూటింగ్ చేస్తూ వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేయాలని నాని సహా సినిమా యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ నిబంధనల మేరకు రోజు సెట్ మొత్తాన్ని శానిటైజ్ చేసి షూటింగ్లో పాల్గొంటున్న అందరు సభ్యులకు ర్యాపిడ్ టెస్టులు చేస్తూ షూటింగ్ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

    అంతా పిపిఈ కిట్లు ధరించి

    అంతా పిపిఈ కిట్లు ధరించి

    అలాగే నటీనటులు తప్ప మిగతా వాళ్ళంతా పిపిఈ కిట్లు వేసుకుని పని చేస్తున్నారని సమాచారం. ఇక ఈ సినిమా కోసం 7 ఎకరాల్లో ఆరున్నర కోట్ల రూపాయల సెట్ నిర్మించారని తెలుస్తోంది. ఇక ల్యాండ్ కూడా దాదాపు కొన్ని నెలల పాటు లీజుకు తీసుకున్నారని తెలుస్తోంది. ఇప్పుడు కనుక వాయిదా వేస్తే షూటింగ్ మరింత లేట్ అయ్యే అవకాశం ఉంటుందని తద్వారా లీజ్ కూడా భారీగా పెరిగిపోయే అవకాశం ఉందని తెలుసుకున్న నాని షూట్ ఆగకుండా చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

    అంతా బాగుంటే ఈ ఏడాది లోనే

    అంతా బాగుంటే ఈ ఏడాది లోనే

    గతంలో విజయ్ దేవరకొండ తో టాక్సీవాలా అనే సినిమా తెరకెక్కించిన రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని వెంకట్ బోయినపల్లి నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు పిరియాడిక్ సినిమా అని ప్రచారం జరుగుతోంది ఇక ఈ సినిమాలో నాని సరసన ఏకంగా ముగ్గురు హీరోయిన్స్ నటిస్తూ ఉండడం ఆసక్తికరంగా మారింది. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అలాగే కీలక పాత్రలో బెంగాలీ నటుడు జిషు సేన్ గుప్తా నటిస్తున్నారు. పరిస్థితులు అంతా బాగుంటే ఈ ఏడాది చివర్లో ఈ సినిమా రిలీజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.

    English summary
    As we all know nani is busy with Shyam Singha Roy shoot. Makers of the film erected a set of Kolkata along with Kaali temple in the outskirts of Hyderabad and it costed Rs 6.5 crores for the makers. With the second wave of coronavirus alert, the shoots of all the Indian films are kept on hold. But Nani dared to continue to the shoot in these alarming situations. This is just to save his producer and not to mount more financial pressure on him. More than a week’s shoot is pending for Shyam Singha Roy and Nani wants to wrap up the shoot at the earliest.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X