జెర్సీ ఫస్ట్ లుక్: క్రికెటర్‌గా నాని.. అర్జున్ ఇంక్రెడిబుల్ స్టోరీ, రిలీజ్ ఎప్పుడంటే!
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం జెర్సీ. మళ్ళీ రావా ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. క్రికెట్ నేపథ్యంలో సాగే ఈ కథని ఎమోషనల్ జర్నీగా చూపించబోతున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా కొద్ది సేపటి క్రితమే జర్సీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. 90 దశకంలో జరిగిన ఓ క్రికెటర్ జీవిత కథగా ఈ చిత్రం రాబోతోంది. నాని వింటేజ్ క్రికెటర్ లుక్ లో అదరగొడుతున్నాడు.
ఈ చిత్రాన్ని 2019 ఏప్రిల్ లో విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అర్జున్ ఇంక్రెడిబుల్ జీవితాన్ని ఏప్రిల్ లో రివీల్ చేస్తాం అని చిత్ర యూనిట్ ప్రకటించింది. నాని ట్వీట్ చేస్తూ.. 36 ఏళ్ల వయసులో క్రికెటర్ గా అతడు నిరూపించుకోవాల్సింది ఏమీ లేదు. అతడు సాధించిన విజయాల్ని వెనుక నిలబడ్డాయి. 1996-97లో జరిగిన రంజీ ట్రోఫీ క్రికెట్ పై అతడికి ఉన్న ప్రేమ బయట పెట్టింది' అంటూ నాని కథలో కీలక అంశం గురించి హింట్ ఇచ్చాడు.

సాధారణ యువకుడి టీం ఇండియా తరుపున అంతర్జాతీయ క్రికెట్ కు ప్రాతినిధ్యం వహించేందుకు ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు.. ఎలాంటి విజయాలు సాధించాడు అనే అంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. శ్రద్దా శ్రీనాథ్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. యువ సంగీత సంచలనం అనిరుద్ రవిచందర్ జెర్సీ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది.


Click it and Unblock the Notifications











