twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    YS Jagan ప్రభుత్వంపై నాని మాటల దాడి.. ఏపీ సర్కార్ విధానాలు సరికాదు అంటూ సెన్సేషనల్ కామెంట్స్

    |

    నేను నటించిన సినిమాలు రిలీజ్ అవుతుందంటే ఒక రకమైన టెన్షన్ ఉంటుంది. కానీ శ్యామ్ సింగరాయ్ సినిమా విషయంలో ఎలాంటి టెన్షన్ లేదు. ఎందుకంటే ఆ సినిమా తప్పకుండా ప్రేక్షకుడికి అనుభూతిని పంచుతుంది. గురువారం రాత్రి ప్రీమియర్స్ ప్రారంభమవుతాయి. ఎలాంటి ఫీడ్ బ్యాక్ వస్తుందనే విషయం కోసం ఆసక్తికరంగా టీమ్ అంతా ఎదురు చూస్తున్నాను అని నాని అన్నారు.

    ప్రేక్షకుడిపై శ్యామ్ సింగరాయ్ ప్రభావం

    ప్రేక్షకుడిపై శ్యామ్ సింగరాయ్ ప్రభావం

    శ్యామ్ సింగరాయ్ సినిమా అన్ని రకాల ఆడియెన్స్‌ను సంతృప్తిని అందిస్తుంది. చాలా కొత్త విషయాలు ఉన్నాయి. కొద్ది గంటల్లోనే మీకు వైవిధ్యం ఏమిటో తెలుస్తుంది. శ్యామ్ సింగరాయ్ చేయబోయే ప్రభావం ప్రేక్షకుడిపై ఉంటుంది. సినిమా చూసిన తర్వాత కొత్త అనుభూతితో ప్రేక్షకుడు ఇంటికి వెళ్తాడనే భరోసాను ఇస్తాను. ఇది ప్యాన్ ఇండియా సినిమా కాదు. కేవలం దక్షిణాది రాష్ట్రాల్లోనే విడుదల చేస్తున్నాం అని నాని చెప్పారు.

    ఏపీ ప్రభుత్వంపై నాని సంచలన వ్యాఖ్యలు

    ఏపీ ప్రభుత్వంపై నాని సంచలన వ్యాఖ్యలు

    ఏపీలో టికెట్ల రేట్ల పెంపు విషయంలో జరుగుతున్న పద్దతి సరికాదు. ప్రతీ ఒక్కరికి కూడా అదే అభిప్రాయం ఉంది. ఈ విషయంపై ప్రస్తుతం ఎలా మాట్లాడాలో.. స్పందించాలో తెలియని పరిస్థితి. రాజకీయాలను, సినిమాలను, థియేటర్లను, రాజకీయ నేతలను పక్కన పెడితే.. ప్రేక్షకుడిని దారుణంగా అవమానానికి గురిచేస్తున్నారనే ఫీలింగ్ కలుగుతున్నది.

    సినిమా టికెట్ రేట్లు 30, 20, 10 రూపాయలు అనే విషయం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది. ఆ విషయంపై నేను స్పందిస్తే.. నా సినిమా రేపు రిలీజ్ కూడా ఉంది. యూట్యూబ్‌లో రకరకాల థంబ్ నెయిల్స్ పెడితే.. ఇది ఎలాంటి వివాదానికి దారితీస్తుందో అర్థం కాని పరిస్థితి అని నాని పలు రకాల సందేహాలను వ్యక్తం చేశారు.

    ప్రేక్షకులను అవమానించడమే

    ప్రేక్షకులను అవమానించడమే

    సినిమా థియేటర్ ద్వారా పది మందికి ఉద్యోగం ఇచ్చే ఓ యాజమాని కంటే.. పక్కన కిరాణం షాపు నడిపే కౌంటర్ బాగా ఉంటే.. అది ఎంత దారుణంగా ఉంటుందో ఎవరైనా ఊహించుకోవచ్చు. రాజకీయాలు, పార్టీలకతీతంగా మాట్లాడాల్సి వస్తే.. ప్రేక్షకులను అవమానపరచవద్దు కదా అని నాని అన్నాడు. అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం తీరు ఎలా ఉందంటే.. ఒక స్కూల్‌లో పిల్లలని విహార యాత్రకు తీసుకెళ్తూ.. అందరి వద్ద 100 రూపాయలు వసూలు చేసి.. ఒక్క విద్యార్థిని ఉద్దేశించి నీవు అంత ఇవ్వలేవు. 10 రూపాయలు ఇస్తే చాలూ అని అంటే ఆ విద్యార్థికి చాలా అవమానంగా ఉంటుంది అని ఏపీ సర్కారుపై సెటైర్లు వేశారు.

    Recommended Video

    Tollywood స్టార్ హీరోలకు షాక్, AP లో No Benefit Shows | AP Govt || Filmibeat Telugu
    నేచురల్ స్టార్ ట్యాగ్ తీసేస్తాను..

    నేచురల్ స్టార్ ట్యాగ్ తీసేస్తాను..

    పిరియాడిక్ చిత్రంగా రూపొందుతున్న శ్యామ్ సింగరాయ్ సినిమా కోసం పెద్దగా హోం వర్క్ చేయలేదు. దర్శకుడి విజన్ ప్రకారం నటించాం. అయితే నన్ను నేచురల్ స్టార్ అని ఒక ఇమేజ్‌కు కట్టిపడేయకండి.. నేచురల్ స్టార్ అనే ట్యాగ్‌ను తీసేయాలని అనుకొంటున్నాం. ఆ ట్యాగ్ నాకు ఇబ్బందికరంగా ఉంటుంది అని నాని అనడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.

    English summary
    Movie Ticket rates issue become hot topic in Andhra Pradesh. In this occasion, Nani sensational comments on YS Jagan's Andhra Pradesh Government over Ticket Rate issue.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X