‘స్టుపిడ్.. దాన్ని పెంచి పోషిస్తున్నాం.. ఆపకపోతే ఇండస్ట్రీకి నష్టం’

తెలుగు సినిమా పరిశ్రమలో నేచురల్ స్టార్ నాని హీరోగా, నిర్మాతగా భారీ విజయాలతో దూసుకుపోతున్నారు. ఆయన నటించిన చిత్రాలే కాకుండా, ఆయన నిర్మించిన మూవీస్ కూడా బాక్సాఫీస్ వద్ద కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నాయి. అయితే చిన్న హీరోగా కెరీర్ ప్రారంభించి ప్రస్తుతం అగ్ర హీరోలతో సమానంగా పోటీ పడుతూ రేసులో దూసుకెళ్తున్నాడు. ఆయన నటించిన హిట్ 3 సినిమా మే 1వ తేదీన రిలీజ్ అవ్వడానికి సిద్దంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో తన రేంజ్ గురించి అడిగిన ఓ ప్రశ్నకు కుండ బద్దలు కొట్టినట్టు జవాబిచ్చారు. నాని చెప్పిన జవాబు వివరాల్లోకి వెళితే..

నాని నటించిన హిట్ 3 సినిమా ట్రైలర్‌ను వైజాగ్‌లోని సంగం థియేటర్‌లో ఆవిష్కరించారు. తన అభిమానులతో తన ఆనందాన్ని, సినిమా విశేషాలను పంచుకొన్నారు. అనంతరం హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్ మీట్‌కు తన టీమ్‌తో హాజరయ్యారు. మీడియాతో ముచ్చటిస్తూ నాని, దర్శకుడు శైలేష్ కొలను వారు అడిగిన ప్రశ్నకు సమాధానాలిచ్చారు.

Natural Star Nani

ఈ సందర్భంగా నాని నటించిన సినిమాలు 100 కోట్లు క్లబ్‌లో చేరుతున్నాయి. హీరోగా టైర్ 1 కేటగిరిలోకి చేరినట్టేనా? అనే ప్రశ్నకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. టైర్ 1 అనే కాన్సెప్ట్‌కు తాను విరుద్దమని తేల్చేశారు. ఇలాంటి కేటగిరిలో హీరోలను పెట్టడం నాకు ఇష్టం ఉండదు. ఇది పరిశ్రమకు మంచి అలవాటు కాదు. కాబట్టి అలాంటి పదాలను వాడటం మానేయడం మంచింది అని ఆయన వివరణ ఇచ్చారు.

నాని మాట్లాడుతూ.. టైర్ 1, టైర్ 2, టైర్ 3 హీరోలు అనే కాన్సెప్ట్‌ నాకు నచ్చదు. టైర్ ఎక్కడుంటుందో, ఎలా ఉంటుందో తెలియదు. సినిమా ట్రేడ్‌లో మీడియా క్రియేట్ చేసింది. అదేమీ డిక్షనరీలో ఉన్నది కాదు. దాన్ని బట్టి హీరోలును కేటగిరీ చేయడం సరికాదు. మీ ఫేవరేట్ యాక్టర్ ఎవరో చెప్పండి. మీరు ఎవరి సినిమాకు వెళ్లాలో చెప్పండి. ఎవరి సినిమాలు ఎలా ఆడుతున్నాయో చెప్పండి. ఎవరి సినిమాలకు తగ్గట్టు బడ్జెట్‌లు, సెటప్‌లు ఉన్నాయో చెప్పండి. అందులో అభ్యంతరాలు ఉండవు అని నానీ అన్నారు.

కానీ హీరోలు సాధించే కలెక్షన్లు, బడ్జెట్‌లను బట్టి ఫలానా హీరో టైర్ 1, ఫలానా హీరో టైర్ 2, ఫలానా హీరో టైర్ 3 కేటగిరి అనేది ఎవరు క్రియేట్ చేసారో తెలియదు. ఇలా ఛాంబర్లలో హీరోలను పెట్టి.. ట్రైన్ మాదిరిగా భోగీలు, భోగీలుగా విడగొట్టి కూర్చొబెడుతున్నారు. కానీ వాటిపై నమ్మకం లేదు. ఇది చాలా స్టుపిడ్ కాన్సెప్ట్. దాన్ని ఆపేయాలి. దాన్ని ఎవరు స్టార్ట్ చేశారో తెలియదు. కానీ మనం అందరం పెంచి పోషిస్తున్నాం. దానిని ఆపేయాలి. దాని ఆపేస్తే సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది. మనం బాగుంటాం అని నాని అసహనంతో వివరణ ఇచ్చారు.

నాని హీరోగా మరో రేంజ్‌లోకి వెళ్లారనే విషయంలో కొత్తగా చెప్పుకోనక్కర్లేదు. హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా భారీ లాభాలను సాధిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఓ సినిమాకు 40 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకొంటున్నారనేది ఇండస్ట్రీలో టాక్ నడుస్తున్నది. దాన్ని చూసుకొంటే.. టాప్ హీరోల సరసన ఆయన చేరినట్టే అనే వాదన వినిపిస్తున్నది.

More from Filmibeat

Read more about: nani hit 3 shailesh kolanu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X