బాలయ్యకే మెమరబుల్ గిఫ్ట్ ఇచ్చిన నాని.. స్పెషల్ సర్ప్రైజ్ తో ఏడిపించేశాడుగా!

నందమూరి బాలకృష్ణ కెరియర్ లో మొట్టమొదటిసారిగా చేస్తున్న 'అన్‌స్టాప‌బుల్‌' తొలి ఎపిసోడ్‌కు మోహన్ బాబుతో పాటు ఆయన కుమార్తె లక్ష్మీ మంచు, కుమారుడు విష్ణు మంచు వచ్చారన్న సంగతి తెలిసిందే. ఇక రెండవ ఎపిసోడ్ కి ముఖ్యఅతిథిగా హాజరైన నాచురల్ స్టార్ నాని బాలకృష్ణ కు ఒక మరుపురాని బహుమతిగా అందించారు. షో చూస్తున్నా అందరిచేత కంటతడి పెట్టించే విధంగా ఉన్న ఆ విషయం వివరాల్లోకి వెళితే

మొదటిది అలా రెండోది ఇలా

మొదటిది అలా రెండోది ఇలా

'అన్‌స్టాప‌బుల్‌ విత్ ఎన్బీకే' తొలి ఎపిసోడ్‌కు మోహన్ బాబుతో పాటు ఆయన కుమార్తె లక్ష్మీ మంచు, కుమారుడు విష్ణు మంచు వచ్చారన్న సంగతి తెలిసిందే. వారితో బాలకృష్ణకు ఎప్పటినుంచో సాన్నిహిత్యం ఉండగా ఆ సాన్నిహిత్యం అయితే ఎపిసోడ్‌లో కనిపించింది. ఇక మొత్తంగా ఈ ఎపిసోడ్ అంతా చాలా సరదాగా సాగింది. యువ హీరోలతో బాలకృష్ణ ఎలా ఉంటారో అనే సందేహాలకు, ప్రశ్నలకు 'అన్‌స్టాప‌బుల్‌' రెండో ఎపిసోడ్ సమాధానం వచ్చేసింది. శుక్రవారం నాడు విడుదలైన రెండవ ఎపిసోడ్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఈ రెండవ ఎపిసోడ్ లో నానితో బాలకృష్ణ చాలా సరదాగా ముచ్చటించారు.

నానితో ఎమోషనల్ గా

నానితో ఎమోషనల్ గా

నానితో క్రికెట్ ఆడారు, జోకులు వేశారు, నవ్వించారు అలా మొత్తం మీద బాలయ్య ఆకట్టుకున్నారు. అయితే ఈ ఎపిసోడ్‌లో ఒక ఎమోషనల్ మూమెంట్ చోటు చేసుకుంది, ఇది చూసిన వారందరికీ కంటతడి తెలియకుండానే వచ్చేస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఒక పక్క హీరోగా నటిస్తూ సమాజసేవలోనూ బాలకృష్ణ ముందు ఉంటారన్న సంగతి తెలిసిందే. ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిస్తే వెంటనే స్పందించే బాలయ్య తన తల్లి పేరిట నెలకొల్పిన బసవరతారకం క్యాన్సర్ ఆస్పత్రి ద్వారా ఎంతోమంది పేదలకు చికిత్స అందిస్తున్న సంగతి తెలిసిందే.

బాలయ్యకు షాకిచ్చి

బాలయ్యకు షాకిచ్చి

ఎంతో మంది ప్రాణాలు కాపాడుతున్న బాలకృష్ణ కాపాడిన ఓ ప్రాణాన్ని అదేనండీ ఒకపాపను 'అన్‌స్టాప‌బుల్‌' షోలో బాలకృష్ణ ముందుకు తీసుకొచ్చారు నేచురల్ స్టార్ నాని. ఎప్పుడో తమ హాస్పిటల్ లో చికిత్స చేయించి కాపాడిన చిన్నారి చూసిన వెంటనే బాలకృష్ణ ఎమోషనల్ అయ్యారు. ఆమెను దగ్గరకు తీసుకుని ఆత్మీయంగా ముద్దాడారు. బాలకృష్ణ కాపాడిన ఆ ప్రాణం పేరు పేరు వినీలాంబిక లాగా ఆ చిన్నారిది పదవర్లపూడి అనే గ్రామం. ప్రస్తుతం ఆరో తరగతి చదువుతున్న ఆమె జూన్ 2, 2011లో జన్మించింది. పుట్టిన రెండు నెలల తర్వాత ఆరోగ్య సమస్యలు ఉన్నాయని ఆస్పత్రికి తీసుకువెళితే కడుపులో ఓ గడ్డ ఉందని, క్యాన్సర్ అని తెలిసింది.

చిన్నారి ప్రాణాలు కాపాడి

చిన్నారి ప్రాణాలు కాపాడి

అయితే ఎన్ని ఆస్పత్రులకు తీసుకువెళ్లినా చిన్నారికి చికిత్స అందించే ధైర్యం ఎవరూ చేయలేదని ఆమె తల్లి ఒక వీడియోలో తెలిపారు. అప్పుడు విజయవాడ మాజీ ఎంపీ గద్దె రామ్మోహనరావు ద్వారా బసవతారకం ఆస్పత్రికి వెళ్లామని, ఆరోగ్య శ్రీ రాక పోయినా బాలకృష్ణగారు దగ్గరుండి పాపకు కీమో థెరపీ చేయించారని, ఈ రోజు మా పాప ఇంత హ్యాపీగా ఉందంటే బాలయ్య బాబుగారే కారణమని, ఆయనకు జీవితాంతం మా కుటుంబమంతా రుణపడి ఉంటామని వినీలాంబిక తల్లి ఎమోషనల్ అయ్యారు.

 అక్కడ కనిపించరు ఇక్కడ కనిపిస్తారు

అక్కడ కనిపించరు ఇక్కడ కనిపిస్తారు


'తిరుపతిలో వెంకటేశ్వర స్వామి కనపడరు. బసవతారకంలో మీరు (బాలకృష్ణ) కనపడతారు" అని వెనీలాంబిక తల్లి అన్నారు. దీంతో బాలకృష్ణ అదేమీ లేదని చెబుతూ చిన్నారిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. అదే సమయంలో చిన్నారికి నాని ఒక ల్యాప్ టాప్ గిఫ్ట్ ఇచ్చారు. "బసవతారకం ఆస్పత్రిని తానెప్పుడూ ఆస్పత్రి అనను. అది దేవాలయం" అని బాలకృష్ణ అన్నారు. వీళ్ళను బాలకృష్ణకు తెలియకుండా షోకి రప్పించిన నాని ఆయనకు మరపురాని అనుభూతిని పంచారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X