PKL ఛాలెంజ్ కాదు.. ఓ యుద్దం.. తొడ గొట్టిన నేచురల్ స్టార్ నాని
క్రీడా రంగంలో క్రీడాభిమానులను ఉత్సాహపరిచేందుకు ప్రో కబాడ్డీ సిద్దమవుతున్నది. ఉత్కంఠ, ఉత్సాహం, రోమాలు నిక్కబొడిచేలా సాగే కబాడ్డీ పోటీలు ప్రరాంబం కానున్నాయి. ఈ కబాడ్డీ లీగ్‌కు వికీ కౌశల్, తారా సుతారియా, నాని, శివ రాజ్‌కుమార్ లాంటి సినీ ప్రముఖులు ప్రోత్సాహం అందిస్తున్నారు. సోషల్ మీడియా పోస్టులు, వారు అందిస్తున్న ప్రోత్సాహం ప్రో కబాడ్డీ లీగ్ (PKL)కు మరింత క్రేజ్ పెంచాయి. ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ పోటీలకు సినీ తారలు ప్రత్యేక ఆకర్షణగా మారనున్నారు. సినీ తారలందరూ స్టేడియాల్లో సందడి చేయనున్నారు. ఈ పోటీల వివరాల్లోకి వెళితే..
2023 సంవత్సరంలో ప్రో కబాడ్డీ పోటీలు భారీగా క్రేజ్ పెరిగింది. ఆహ్మదాబాద్‌లో డిసెంబర్ 7వ తేదీన జరిగే పోటీకి మనోజ్ బాజ్‌పేయ్ హాజరుకానున్నారు. బెంగళూరులో డిసెంబర్ 8వ తేదీన జరిగే పోటీకి సుదీప్ కిచ్చ హాజరవుతారు. అలాగే ఇంకా పలువురు సినీ ఆగ్ర తారలు ఈ పోటీల్లో ప్రత్యేక ఆకర్షణగా మారనున్నారు.

తెలుగు టైటాన్స్ జట్టు పాల్గొనే పోటీలకు వరున్ తేజ్, ఓంకార్, శ్రీలీల, వరుణ్ తేజ్, నానీ హాజరయ్యే అవకాశం ఉంది. తెలుగు టైటాన్స్ జట్టుకు పలువరు హీరోలు ప్రోత్సాహం అందించనున్నాను. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. పోటీల్లో కేవలం బలమే కాదు.. స్పీడ్ ముఖ్యం. అందుకే ఇది ఛాలెంజ్ కాదు. పోటీలంటే ఓ యుద్దంగా మారాయి. రైడర్ ప్రత్యర్థి జట్టు ప్లాన్స్‌ను కూడా పరిశీలించాలి. వాటిని భగ్నం చేసే విధంగా ఎత్తులు వేయాలి. ఈ సారి పీకేఎల్ పోటీల్లో తెలుగు టైటాన్స్ దుమ్మురేపుతుంది అని నాని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇక తమిళ, కన్నడ జట్టకు శివరాజ్ కుమార్, గౌతమ్ మీనన్, రీతూ వర్మ ప్రోత్సాహం అందించనున్నారు. ఇప్పటికే ప్రోమోలో కనిపించి ఈ పోటీలకు మరింత క్రేజ్ పెంచారు.


Click it and Unblock the Notifications











