నేచురల్ స్టార్ సేఫ్ కామెడీ.. అంతకు మించి ఉంటుందట

వెండితెరపై ఆడియెన్స్ ని ఆకట్టుకోవాలి అంటే ఎంతగానో కష్టపడాల్సి ఉంటుందని అందరికి తెలిసిన విషయమే. కానీ నాని మాత్రం తన నేచురల్ నటనతోనే థియేటర్స్ కి మళ్ళీ మళ్ళీ వచ్చేలా చేస్తాడు. నేచురల్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న ఈ యువ హీరో తన కామెడీ ట్రాక్ ని మిస్సవుతున్నట్లు అనిపించింది.

రెగ్యులర్ గా కాకుండా కాస్త డిఫరెంట్ గా ట్రై చేయాలని అనుకోని జెర్సీ, గ్యాంగ్ లీడర్, V వంటి సినిమాలు చేశాడు. అయితే నానిని పూర్తిగా కమెడియన్ గా చూసి చాలా కాలమవుతోంది. ఇక ఆ టాక్ ఎక్కువ కాకముందే మనోడు ఫ్యామిలీ జానర్ లో ఒక అన్ లిమిటెడ్ కామెడీ సినిమాతో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల నాని వివేక్ ఆత్రేయతో ఒక సినిమా చేయనున్నట్లు అఫీషియల్ గా ఎనౌన్స్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఆ సినిమా టైటిల్ పై త్వరలోనే ఒక అప్డేట్ రానుంది.

 Natural star nani upcoming movie latest update

"అంటే.. సుందరానికి" అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లుగా ఒక టాక్ అయితే వస్తోంది. సుందరం అనే పేరు వినగానే ఒక పాత సినిమా కామెడీ జనర్ స్టైల్ లో దర్శకుడు కిక్కివ్వబోతున్నట్లు డౌట్ వస్తోంది. భలే భలే మగాడివోయ్ సినిమా తరువాత నాని ఆ రేంజ్ లో కామెడీ పండించిన సినిమాలు రాలేవు. అయితే ఈ సారి సుందరం క్యారెక్టర్ తో అంతకు మించిన రేంజ్ లో కామెడీ అంధించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక వచ్చే ఏడాది ఎలాగైనా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకి తీసుకురావాలని నాని ప్లాన్ చేసుకుంటున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X