Don't Miss!
- News దేశంలో ఫస్ట్ టైమ్, పోలీసులకు ఏసీ హెల్మెట్లు, ప్రభుత్వం అంటే ఇలా ఉండాలి, పండగే పండగ !
- Sports LSG vs CSK: రూ. కోట్లు పలికిన ఆ ఇద్దరిని తప్పించాం- రుతురాజ్
- Lifestyle ఇవి తింటే మీ జుట్టు చాలా బలంగా మారుతుంది.. బట్టతల కూడా రాదు..
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
తండ్రి కొడుకులు ఒకేలా.. రియల్ లైఫ్‌లో డబుల్ రోల్.. ఏ హీరో కొడుకు ఫొటోనో కనుక్కోండి చూద్దాం..
నేచురల్ స్టార్ నాని సినీ జీవితాన్నే కాకుండా పర్సనల్ లైఫ్‌ను భలేగా ఎంజాయ్ చేస్తుంటాడు. టైమ్ దొరికితే చాలూ ఫ్యామిలీతో గడిపేందుకు ఉత్సాహం చూపుతాడు. ప్రధానంగా తన కుమారుడికే ఎక్కువగా సమయాన్ని గడిపేందుకు ఇష్టపడుతాడనే విషయం తాను పోస్ట్ చేసే విషయాల ద్వారా స్పష్టమవుతుంది. తాజాగా బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు.
|
ఒకేలా కనిపిస్తున్నాం కదా
తన కుమారుడు ఫోటో పక్కన తన చిన్నప్పటి ఫొటో పెట్టి ఒకేలా ఉన్నామంటూ నానీ ట్వీట్ చేశాడు. హ్యాపీ చిల్డ్రన్స్ డే. నేను.. మా అబ్బాయి ఒకేలా కనిపిస్తున్నాం. రియల్ లైఫ్‌లో డబుల్ రోల్. రెండు విభిన్నమైన తరాల వ్యక్తులు ఒకేలా కనిపిస్తున్నారు అంటూ నాని ట్వీట్ చేయడం జరిగింది.
కుమారుడితో కలిసి దీపావళీ పండుగ
ఏదైనా పండుగ గానీ.. లేదా మంచి రోజు ఉంటే తప్పకుండా నాని సోషల్ మీడియాలో స్పందిస్తారు. కొద్ది రోజుల క్రితం దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. తన కుమారుడితో కలిసి దిగిన ఫొటోను ట్విట్టర్లో పెట్టాడు. ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
నాని కొడుకు పుట్టిన రోజు
తన కుమారుడిని ఎంతగా ప్రేమిస్తాడనే విషయం నాని చేతల్లో కనిపిస్తుంది. తన కొడుకు మొదటి పుట్టిన రోజును పురస్కరించుకొని ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు. నా లిటిల్ రాస్కెల్ పుట్టి ఏడాది అయింది. దొంగ నా కొడుకు. జున్నుగాడు అంటూ ట్వీట్ చేసి తన ప్రేమను చాటుకొన్నాడు.
జెర్సీ సినిమాతో నాని
ఇక కెరీర్ విషయానికి వస్తే.. నాని నటించిన దేవదాస్ చిత్రం భారీ విజయాన్ని అందుకొన్నది. నాగార్జునతో కలిసి నటించిన మల్టీస్టారర్‌కు బాక్సాఫీస్ వద్ద మంచి రెస్సాన్స్ కనిపించింది. ప్రస్తుతం జెర్సీ చిత్రంలో నటిస్తున్నాడు. ఇది క్రికెట్ ఆట నేపథ్యంగా రూపుదిద్దుకొంటున్నది.