అదిరిపోయే డైలాగ్‌తో రజనికి బర్త్ డే విషెష్ చెప్పిన నాని!
నేచురల్ స్టార్ నాని వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది నాని నటించిన కృష్ణార్జున యుద్ధం, దేవదాస్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ రెండు చిత్రాలు ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేదు. ప్రస్తుతం నాని జెర్సీ చిత్రంలో నటిస్తున్నాడు. మళ్ళీ రావా ఫేమ్ గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రానికి దర్శకుడు. క్రికెట్ నేపథ్యంలో రూపొందితున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ఇదిలా ఉండగా నేను సూపర్ స్టార్ రజనీకాంత్ బర్త్ డే సందర్భంగా నాని శుభాకాంక్షలు తెలియజేశాడు. అదిరిపోయే డైలాగ్ తో రజనికి నాని బర్త్ డే విషెష్ తెలిపాడు. నిన్నుకోరి చిత్ర షూటింగ్ సమయంలో రూపొందించిన ఓ వీడియో ఇప్పుడు రజనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడానికి ఉపయోగపడింది. నిన్నుకోరి చిత్ర షూటింగ్ యుఎస్ లో జరుగుతున్న సమయంలో రజనీకాంత్ స్టైల్ ని అనుకరిస్తూ ఓ వీడియో చేశాడు.

శివాజీ చిత్రంలోనే నానా పందులే గుంపుగా వస్తాయి.. సింహం సింహం సింగిల్ గా వస్తుంది అనే డైలాగ్ చెబుతూ రజని స్టైల్ లో సిగరెట్ నోటితో క్యాచ్ చేసే ప్రయత్నం చేశాడు. ఈ వీడియోని పోస్ట్ చేయడానికి ఇదే సరైన సమయం అని నాని తెలిపాడు.


Click it and Unblock the Notifications











