ఆ తరువాతే పెళ్లి.. నవదీప్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
తెలుగు తెరకి హీరోగా పరిచయమైన నవదీప్.. జై, గౌతమ్ ఎస్ఎస్‌సీ, చందమామ వంటి చిత్రాలో మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే పూర్తి స్థాయి హీరోగా మాత్రం నిలదొక్కుకోలేకపోయాడు. అయితే మెగా ఫ్యామిలీ అండ ఉండటంతో అంతో ఇంతో ఇంకా కెరీర్ ముందుకుసాగుతోంది. మధ్యలో ధృవ, నేనే రాజు నేనే మంత్రి వంటి చిత్రాల్లో ప్రధాన పాత్రలను పోషించి మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి పేరు వస్తుండటంతో ఆ దిశగానే ప్రయత్నాలు చేస్తుూ వస్తున్నాడు. కేవలం వెండితెరపైనా కాకుండా ప్రస్తుతం బుల్లితెరపైనా సందడి చేసేస్తున్నాడు. అదిరింది షోకు న్యాయనిర్ణేతగా నవ్వులు పూయిస్తున్నాడు. అంతేకాకుండా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లోనూ నవదీప్ దుమ్ములేపుతున్నాడు. ఈ మేరకు నవదీప్ మాట్లాడుతూ అనేక విషయాలను వెల్లడించాడు.

నవదీప్ తాజాగా మాట్లాడుతూ.. కొంతకాలం క్రితం వరకూ కెరియర్ పట్ల అసంతృప్తి వుండేదని, ఇటీవల కాలంలో ఆశాజనకంగానే వుందని చెప్పుకొచ్చాడు. వెబ్ సిరీస్‌లు చేస్తున్నానని, అలాగే తెలుగులో 'మోసగాళ్లు' సినిమాలో విలన్‌గా చేశానని తెలిపాడు. ఆ పాత్ర తనకు మరిన్ని అవకాశాలు తెచ్చిపెడుతుందనే నమ్మకం వుందని అన్నాడు.
మరో రెండు తెలుగు సినిమాలకు .. ఒక తమిళ సినిమాకు సైన్ చేశానని పేర్కొన్నాడు. ఇక నుంచి కెరియర్‌ను తెలివిగానే ప్లాన్ చేసుకుంటానని అన్నాడు. ఇక ఎక్కడికి వెళ్లినా అందరూ 'పెళ్లెప్పుడు' అని అడుగుతున్నారని,. ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదని ఖరాఖండిగా చెప్పేశాడు. ఆర్ధికంగా నిలదొక్కుకున్న తరువాతనే పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నానని చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications











