నవదీప్ అమాయకుడట.. నాటి ఫోటో షేర్ చేసిన హీరో
తెలుగులో పాత్రకు తగ్గట్టు నటించే యువ హీరోల్లో అతి కొద్ది మందే ఉన్నారు. అందులో నవదీప్ ఒకరు. మొదటి నుంచి విభిన్న రకాల పాత్రలను చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. కెరీర్‌లో జై, చందమామ, గౌతమ్ ఎస్సెస్సీ వంటి సూపర్ హిట్ చిత్రాలు కూడా ఉన్నాయి. ఆపై వరుసగా చిత్రాలు బోల్తా కొట్టడంతో మధ్యలో కొన్నేళ్లు దూరంగా ఉంటూ వచ్చాడు. ఆపై సైడ్ క్యారెక్టర్స్ పోషిస్తూ మంచి పేరు సంపాదించుకున్నాడు.
నేనే రాజు నేనే మంత్రి, ధృవ వంటి చిత్రాల్లో నవదీప్ నటనకు అంతా ఫిదా అయ్యారు. సపోర్టింగ్ రోల్స్‌లో నవదీప్ తనకు తానే సాటి అని మరోసారి నిరూపించుకున్నాడు. నవదీప్ ప్రస్తుతం బుల్లితెరపై, వెబ్ సిరీస్‌లో అదరగొడుతున్నాడు. అదిరింది షోలో పంచ్‌ల వర్షం కురిపిస్తూ అందర్నీ నవ్విస్తున్నాడు. అదిరింది జడ్జ్‌గా నవదీప్ అద్భుతంగా చేస్తున్నాడు. మరో వైపు ఓటీటీ ఫ్లాట్‌ఫాంలోనూ నవదీప్ ఇరగ్గొడుతున్నాడు.

నవదీప్ తాజాగా ఓ వీడియోను, ఓ ఫోటోను షేర్ చేస్తున్నాడు. గత కొంతకాలం నుంచి నవదీప్ సిక్స్ ప్యాక్ లుక్‌లో అందర్నీ ఫిదా చేస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా అలాంటి ఓ ఫోటోను షేర్ చేయగా అది వైరల్ అవుతోంది. అంతేకాకుండా చిన్న నాటి ఫోటోనూ కూడా షేర్ చేశాడు. అందులో నవదీప్‌కు ఓ ఐదారేళ్లు ఉండొచ్చు. అమాయకుడు అంటూ కామెంట్ చేస్తూ ఆ ఫోటోను నవదీప్ సోషల్ మీడియాలో పెట్టేశాడు. ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట్లో బాగా వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











