చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో అలాంటోళ్లు కూడా ఉన్నారు: వివాదాస్పద సీన్‌పై నవీన్‌చంద్ర

సినిమా పైరసీని కథాంశంగా ఎంచుకోవడం అంటే కాంట్రవర్సల్ సబ్జెక్ట్ ఏమీ కాదు, ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న సిచ్యువేషన్ గురించి తమ సినిమాలో చెప్పాలనుకున్నామని నవీన్ చంద్ర అన్నారు. ఆయన నటించిన 'హీరో హీరోయిన్' మూవీ టీజర్ రిలీజ్ సందర్భంగా నవీన్ చంద్ర మాట్లాడుతూ.. పైరసీని అరికట్టడానికి నిర్మాతలు చాలా కష్టపడుతున్నారు. నేను నా ఫిల్మ్ కంటెంట్ ద్వారా నా వంతుగా చేయాల్సింది చేస్తున్నట్లు తెలిపారు. సినిమాలో రామ్ చరణ్ అభిమానులు, ఎన్టీఆర్ అభిమానులను ఉద్దేశించివివాదాస్పద సీన్ ఉండటంపై ఆయన వివరణ ఇచ్చారు.

బూతులు తిట్టుకునే ఫ్యాన్స్ ఉన్నారు

బూతులు తిట్టుకునే ఫ్యాన్స్ ఉన్నారు

టీజర్లో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ ప్రస్తావనతో వివాదాస్పద సన్నివేశం ఉండటంపై నవీన్ చంద్ర మాట్లాడుతూ.. అలాంటి ఫ్యాన్స్ కొందరు ఉన్నారు. యూట్యూబ్‌లో ఎవరైనా హీరో ట్రైలర్ విడుదలైతే మరో హీరో ఫ్యాన్స్ తిట్టడం, అసభ్య పదజాలంతో దూషించడం లాంటివి చేస్తున్నారు. హీరోలంతా బానే ఉన్నారు. అందరికీ వినోదం పంచుతున్నారు. ఫ్యాన్స్ మాత్రం ఎందుకు ఇలా ఉన్నారు, ఎలా ఉంటే బావుంటుంది అని ఇందులో చూపించబోతున్నామని తెలిపారు.

అది ఇండస్ట్రీ అదృష్టం

అది ఇండస్ట్రీ అదృష్టం

తెలుగు ఇండస్ట్రీలో ఫ్యాన్ బేస్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. సినిమా విడుదలవుతుందంటే పండగలా భావిస్తారు. పనులు అన్నీ వదిలేసి వెళ్లి సినిమా చూడటం చేయడం అంటేచాలా గొప్ప విషయం. అలాంటి ఫ్యాన్స్ ఉండటం మన ఇండస్ట్రీ అదృష్టం.

ఫ్యాన్స్ తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు

ఫ్యాన్స్ తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు

కొన్ని సినిమాలకు రిలీజ్ ముందే పైరసీ వచ్చింది. అయినా కూడా ఫ్యాన్స్ థియేటర్‌కు వెళ్లి చూడటం, కలెక్షన్ల వర్షం కురిపించడం చేశారు. ఫ్యాన్స్ తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. ఫ్యాన్స్‌లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు ఉన్నారు, బిటెక్ స్టూడెంట్స్ ఉంటారు. టెక్నాలజీ తెలిసిన వారు ఉన్నారు. మా హీరో సినిమా పైరసీ వస్తుందని తెలుసుకుని ఐపీ అడ్రస్ లేదా ఇంటి అడ్రస్ కనుక్కుని వెళ్లి దాన్ని ఆపడం వారికి సాధ్యమే.

‘ఆర్ఆర్ఆర్'లో ఇద్దరూ కలిసి నటిస్తారని తెలియదు

‘ఆర్ఆర్ఆర్'లో ఇద్దరూ కలిసి నటిస్తారని తెలియదు

మేము షూటింగ్ మొదలుపెట్టినపుడు ‘ఆర్ఆర్ఆర్' అనౌన్స్‌మెంట్ ఇంకా రాలేదు. వారు ఇద్దరూ కలిసి సినిమా చేస్తారని కూడా తెలియదు. తమ స్టార్లను అభిమానులు దేవుడుగా భావిస్తారు. వారు కూడా సమాజం కోసం, అభిమానుల కోసం తమ వంతు బాధ్యత నిర్వర్తిస్తున్నారు. వారు చేసే పని నచ్చి ఫ్యాన్స్ ఫాలో అవుతున్నారు.

ముందే సినిమా లీకైనా హిట్ చేశారు

ముందే సినిమా లీకైనా హిట్ చేశారు

ఫ్యాన్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు కాబట్టి.. వారే స్వయంగా పైరసీ మీద రియాక్ట్ అయితే దాన్ని సగానికంటే ఎక్కువ తగ్గించవచ్చు అనే ఫీలింగుతో దర్శకుడు రాసుకున్న కథ ఇది. ఇటీవల ‘టాక్సీవాలా' రిలీజ్ ముందే లీకైంది. కానీ ఫ్యాన్స్ థియేటర్‌కు వచ్చి చూసి హిట్ చేశారు. ఫ్యాన్స్ ఎలా ఉంటే హీరోలకు, ఇండస్ట్రీకి మంచి జరుగుతుంది అనేది సినిమాలో చెప్పే ప్రయత్నం చేశామని నవీన్ చంద్ర తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X