ధనుష్‌కు విలన్‌గా తెలుగు హీరో!
నవీన్ చంద్ర అందాల రాక్షసి చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ చిత్రం నవీన్ చంద్రకు మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో హీరోగా నటించాడు. కానీ ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయారు. హీరోలుగా ఎంట్రీ ఇచ్చి సరైన సక్సెస్ సాధించలేకపోతే ఇతర కీలక పాత్రల్లో నటించడానికి మొగ్గు చూపుతుంటారు. నవీన్ చంద్ర కూడా అదే చేస్తున్నాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ అరవింద సమేత చిత్రంలో నవీన్ చంద్ర విలన్ పాత్రలో నటించాడు.
మరోమారు ఈ హీరో విలన్ రోల్ కు సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తమిళ క్రేజీ హీరో ధనుష్ దొరై సెంథిల్ దర్శత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో విలన్ గా నవీన్ చంద్ర ఎంపికయ్యాడు. నవీన్ చంద్రకు తమిళం కూడా బాగా రావడం అతడికి కలసి వచ్చింది. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయింది. అందాల రాక్షసి లాంటి ఎమోషనల్ లవ్ స్టోరీలో మెప్పించిన నవీన్ చంద్ర ప్రస్తుతం విలన్ పాత్రల్లో నటిస్తుండడం ఆసక్తిగా మారింది.

అరవింద సమేత చిత్రంలో జగపతిబాబు తనయుడిగా నెగిటివ్ షేడ్స్ లో నవీన్ మంచి నటన కనబరిచాడు. రాయలసీమ యాసలో బాగా నటించాడని గుర్తింపు వచ్చింది. నవీన్ చంద్ర తెలుగులో 28 డిగ్రీ సెల్సియస్, హీరో హీరోయిన్ లాంటి చిత్రాల్లో నటిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











