చిరంజీవి, మహేష్ బాబు, రవితేజ, రాజమౌళి అలా అనడంతో.. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి గురించి నవీన్ పొలిశెట్టి
యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టితో కలిసి నటించిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్లోనూ మంచి వసూళ్లు సాధించింది. థర్డ్ వీక్ లోనూ గ్లోబల్గా స్టడీ కలెక్షన్స్ తో ప్రదర్శితమవుతోంది. ఆడియెన్స్ లవ్ తో పాటు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ పెద్దల నుంచి కూడా అప్రిషియేషన్స్ ఈ మూవీకి దక్కాయి. ఈ నేపథ్యంలో 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సక్సెస్ తనకు అందించిన హ్యాపీనెస్ గురించి హీరో నవీన్ పోలిశెట్టి మీడియాతో మాట్లాడుతూ..
మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాపై ప్రేక్షకులే కాకుండా సినీ ప్రముఖులు కూడా మంచిగా ప్రశంసల వర్షం కురిపించారు. మా సినిమాకు చిరంజీవి ఫస్ట్ ఆడియెన్. మా సినిమాను ఎవరూ చూడకముందు చిరంజీవి చూశారు. మమ్మల్ని ఇంటికి కూడా పిలిచారు. మీ సినిమా నాకు నచ్చింది. ట్విట్టర్‌లో రివ్యూ పెట్టవచ్చా? అని అడిగితే.. అంతకంటే భాగ్యం ఏముంటుందని అనుకొన్నాను. అలా చిరంజీవితో మొదలై రాంచరణ్‌తో ముగియడం చాలా ఎమోషనల్‌గా ఉంది అని నవీన్ పొలిశెట్టి తెలిపారు.

చిరంజీవిని నా లైఫ్‌లో ఎప్పుడూ కలువలేదు. తొలిసారి కలిసినప్పుడే మాతో రెండు గంటలపాటు మాట్లాడారు. ఫస్ట్ టైమ్ కలిసినప్పడుు ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి. కానీ చిరంజీవి గారే అంతా మాట్లాడటంతో హ్యాపీగా ఫీలయ్యాను. రెండు గంటలపాటు నా ఫెర్ఫార్మెన్స్ గురించి పొగుడుతూ ఉంటే.. నాకు నోట మాట రాలేదు. ఆయన మాటలతో మాకు హిట్ కొట్టాబోతున్నామనే ధైర్యం వచ్చింది. యూఎస్‌లో షోలు స్టార్ట్ అయి.. పాజిటివ్ టాక్ రావడంతో ఇంకా ధైర్యం పెరిగింది అని నవీన్ పొలిశెట్టి చెప్పారు.
చిరంజీవి తర్వాత మహేష్ బాబు సినిమా చూసి అదిరింది అని ట్వీట్ చేశారు. ఆ తర్వాత సినిమా చాలా ఎంటర్‌టైనింగ్ ఉందని రవితేజ ట్వీట్ చేశారు. సినిమా బాగుందని రాజమౌళి గారు ట్వీట్ చేశారు. సమంత, బ్రహ్మజీ ఇంకా చాలా మంది ట్వీట్ చేశారు. ఫోన్ చేసి అభినందించారు. ఈ సినిమాకు అదే అదృష్టం. ఆడియెన్స్, ఇండస్ట్రీ వర్గాలు ముందుకొచ్చి చాలా రోజుల తర్వాత మంచి సినిమా వచ్చిందని స్వచ్చందంగా ప్రమోషన్ చేశారు. వారందరికి నేను థ్యాంక్స్ చెప్పుకొంటాను అని నవీన్ పొలిశెట్టి చెప్పారు.

మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా నటుడిగా నాకు మరింత బాధ్యతను ఇచ్చింది. సినిమా పరిశ్రమకు సంబంధం లేకున్నా నా కోసం కథలు రాస్తున్నారు. పలు నిర్మాతలకు నేనంటే నమ్మకం కలిగింది. నేను నటించిన సినిమాలకు ప్రేక్షకులు వస్తున్నారు. ఈ సినిమా సక్సెస్ నాకు మరిచిపోలేనిది. ఎందుకంటే.. నవీన్ కామెడీ కంటే ఇంకా ఏదో చేయగలడని చాలా రివ్యూలు చెప్పాయి. దాంతో నేను ఇంకా మంచి సినిమాలు చేయాలనే బలమైన కోరికను కలిగించింది అని నవీన్ పొలిశెట్టి చెప్పారు.

సినిమాల చేయడంలో నాకు ప్లానింగ్ ఏమీ లేదు. నాకు నచ్చిన స్క్రిప్టు ఎంచుకొంటాను. స్క్రిప్టు ప్రకారం నేను ఎలా నటించాలని చూసుకొంటాను. దర్శకులు అడిగితే నేను కథలో, స్క్రిప్టులో ఇన్వాల్వ్ అవుతాను. డైరెక్టర్ నన్ను అడిగితే నేను చాలా వరకు ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నిస్తాను. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా కోసం నేను మహేష్ రెండు నెలలపాటు వర్క్ చేశాం అని నవీన్ పొలిశెట్టి చెప్పారు.


Click it and Unblock the Notifications











