ఆ రోజులన్నీ గుర్తున్నాయ్ సర్.. మహేష్ బాబుపై నవీన్ పొలిశెట్టి కామెంట్స్
సూపర్ స్టార్ మహేష్ బాబు తనకు ఏదైనా సినిమా నచ్చితే తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటాడు. మంచి చిత్రాల గురించి నాలుగు మాటలు చెప్పి తన వంతు మద్దతు ప్రకటిస్తాడు. తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో చెబుతూ ప్రమోషన్స్ కల్పిస్తుంటాడు. అలా తాజాగా మహేష్ బాబు జాతి రత్నాలు సినిమాపై కామెంట్ చేశాడు. జాతి రత్నాలు సినిమాలో నవీన్ పొలిశెట్టి కనబరిచిన నటనపై ప్రశంసలు కురిపించాడు.
ఓ వైవు ట్రెడిషినల్ మరోవైపు గ్లామర్.. ఉప్పెన బ్యూటీ డిఫరెంట్ లుక్స్
నవీన్ పొలిశెట్టి మహేష్ బాబు నటించిన వన్ నేనొక్కడినే చిత్రంలో ఓ చిన్న రోల్ పోషించాడు. నాటి రోజులను గుర్తు చేసుకుంటూ నవీన్ పొలిశెట్టి ప్రతిభపై మహేష్ బాబు ట్వీట్ వేశాడు. వన్ మూవీ టైంలో నవీన్‌తో మాట్లాడిన మాటలన్నీ గుర్తున్నాయి. ఎంతో కష్టపడే తత్త్వం ఉన్న నటుడు అంటూ చెప్పుకొచ్చాడు. అతనిలో ఏదో స్పార్క్ ఉందని అప్పుడే అనిపించింది.

ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరిచాడు. అదిరిపోయేలా నటించేశాడంటూ నవీన్‌పై ప్రశంసలు కురిపించాడు మహేష్ బాబు. మహేష్ ట్వీట్‌కు నవీన్ పొలిశెట్టి రిప్లై ఇచ్చాడు. మిమ్మల్ని చూస్తూ ఉన్న ప్రతీ క్షణం ఏదో ఒకటి నేర్చుకున్నాను అవన్నీ ఇప్పటికీ గుర్తున్నాయ్ సర్.. మీరు వేసిన ట్వీట్ చూస్తుంటే పింపుల్స్ వచ్చినట్టు అనిపిస్తోంది.. థ్యాంక్యూ సో మచ్ అంటూ నవీన్ పొలిశెట్టి తన స్టైల్లో రిప్లై ఇచ్చాడు.


Click it and Unblock the Notifications











